ఆంధ్రప్రదేశ్‌

ప్రోబయోటిక్స్‌లో యాంటీ బయోటిక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 19: ప్రోబయోటిక్స్ పేరుతో ఆక్వా రంగానే్న నమ్ముకున్న రైతాంగాన్ని వ్యాపారులు మోసం చేస్తున్నారని స్లెర్లింగ్ విశ్వవిద్యాలయ ఆక్వా శాస్తవ్రేత్తల బృందం తేల్చింది. దీనివల్ల యావత్తు ఆక్వా పరిశ్రమే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందని అభిప్రాయపడింది. రాష్ట్రం నుండి ఏటా జరిగే రూ.25వేల కోట్ల ఆక్వా ఎగుమతుల్లో 30 శాతం క్షీణించాయన్నారు. వివిధ దేశాలకు చెందిన ఆక్వా శాస్తవ్రేత్తలు గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ని పట్టిపీడిస్తున్న వైరస్‌లపై అధ్యయనం చేశారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న హ్యాచరీలు, సీడ్, ఫీడ్‌తోపాటు చెరువులను పరిశీలించి శాంపిల్స్‌లను సేకరించి పరిశోధనలు చేశారు. ఇండోనేషియా, తైవాన్, జపాన్ తదితర దేశాల పేరుతో ఆక్వా రైతులకు విక్రయిస్తున్న ప్రోబయోటిక్స్‌లో యాంటిబయోటిక్స్ కలిపి విక్రయిస్తున్నారని ఆక్వా శాస్తవ్రేత్తలు గుర్తించారు. దీనివల్ల అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రొయ్యల రకాలు తక్కువ కాలంలోనే వ్యాధుల బారినపడటం, రైతాంగానికి నష్టం రావడం జరుగుతోందని తేల్చారు.
దీంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆనంద గ్రూప్, యుకెకి చెందిన సెర్లింగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లోని పలు విషయాలను ప్రాజెక్టు టీం హెడ్ డాక్టర్ ఫ్రాన్సస్ ముర్రే విలేఖర్లకు వెల్లడించారు. ఆక్వా సాగుకు ప్రసిద్ధిచెందిన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 70 శాతం మంది ప్రోబయోటిక్స్‌లో యాంటిబయోటిక్స్ ఉన్నట్లు తెలియక వినియోగిస్తున్నారన్నారు. ప్రోబయోటిక్స్ వల్ల రొయ్య నాణ్యత మరింత పెరుగుతుందన్నారు. ఆక్వా శాస్తవ్రేత్తల బృందం ఎటువంటి వాటిని రొయ్యల మేతకు ఉపయోగించాలో రైతులకు సూచిస్తుందన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతాంగానికి త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో తమ బృందం పర్యటించిందన్నారు.
ఆనంద గ్రూప్ ఛైర్మన్ యుకె విశ్వనాథరాజు మాట్లాడుతూ ఆక్వా శాస్తవ్రేత్తలు, ఫిషరీస్, ఎంపెడ తదితర విభాగాలకు చెందిన వారితో ఒక కమిటీని ఏర్పాటుచేసి, ఆక్వా రంగం అభివృద్ధి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తామన్నారు. ఈ ఏడాది మే, జూన్ నుంచి ఆక్వా పరిశ్రమకు గడ్డుకాలం ఎదురైందన్నారు. ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ ధాక్సు సి జోసఫ్, ససెయినబుల్ ఆక్వాకల్చర్ సీఈవో కె.షణ్ముఖరావు, ఫిషరీస్ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ప్రొఫెసర్ సి.మోహన్‌కుమార్ నాయర్, ఎంపెడా ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.