ఆంధ్రప్రదేశ్‌

జాతి భద్రత, రక్షణకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 19: జాతి భద్రత, రక్షణకు భారత్, సింగపూర్ నౌకాదళాల సంయుక్త సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని ఇరు దేశాలకు చెందిన నౌకాదళ ప్రధానాధికారులు ఉద్ఘాటించారు. సింగపూర్, ఇండియా మారిటైం బైలేటరల్ ఎక్సర్‌సైజ్ 2018 (సింబెక్స్ 18) రజతోత్సవాలను పురస్కరించుకుని తూర్పునౌకాదళ యుద్ధ నౌకలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సింబెక్స్ లోగోను, ఇరు దేశాల పోస్టల్ కవర్, స్టాంప్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ ప్రధానాధికారి సునీల్ లాంబ మాట్లాడుతూ ఎటువంటి అవాంతరాలు లేకుండా సింబెక్స్ రెండున్నర దశాబ్ధాలుగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది జూన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ షంగ్రీల సందర్శన సందర్భంగా చేసిన వాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. 1994లో యాంటీ సబ్‌మెరైన్ ఎక్సర్‌సైజ్‌గా ప్రారంభమైన ఇరు దేశాల ద్వైపాక్షిక విన్యాసాలు, రెండున్నర దబాబ్ధాల్లో పటిష్ఠ భద్రత, నౌకా వాణిజ్యంలో కీలకంగా కొనసాగుతోందన్నారు. షణ్ణో వరుష్ పేరిట భారత్ నౌకాదళం, బియాండ్ హారిజన్ పేరిట రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నౌకాదళాలు సముద్రం కరుణ చూపుతుందని భావిస్తాయన్నారు. సింబెక్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా గత తొమ్మిది రోజులుగా సీ ఫేజ్, హార్బర్ ఫేజ్ విన్యాసాలు సాగించాయన్నారు. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ ఛీఫ్ అడ్మిరల్ లూ చున్ హాంగ్ మాట్లాడుతూ భారతదేశం ఎన్నో దేశాలతో నౌకా వాణిజ్యం నెరుపుతోందన్నారు.
భౌగోళికంగా భారత్ అతగిపెద్ద దేశమైతే, సింగపూర్ అతి చిన్న దేశమన్నారు. అయినప్పటికీ గత రెండున్నర దశాబ్దాలుగా ఇరు దేశాల నౌకాదళాళు సముద్ర జలాల స్వేచ్ఛా వాణిజ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు. సింగపూర్ భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా పేర్కొన్నారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు బీజం వేశారన్నారు. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన ఒప్పందాలు ఇరు దేశాల సంబంధాలను మరింత మెరుగుపరిచే దిశగా సాగుతాయన్నారు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో కూడా సింబెక్స్ విన్యాసాలు కొనసాగించామని, ఏ ఇతర దేశంతో కన్నా భారత్‌తోనే సింగపూర్ నౌకదళ విన్యాసాలు కొనసాగిస్తోందన్నారు.
సింగపూర్, భారత్ మారీటైం బైలేటరల్ ఎక్సర్‌సైజ్‌కు ఇరవైఐదేళ్ల పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక లోగోను ఇరు దేశాల నౌకాదళ ప్రధానాధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. అలాగే సింబెక్స్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని భారత్‌లో ప్రత్యేక పోస్టల్ కవర్‌ను, సింగపూర్ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. కార్యక్రమంలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి కరమ్ బీర్ సింగ్, తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫ్‌సర్ రియల్ అడ్మిరల్ డినేష్ కే త్రిపాఠి ప్రసంగించారు. ఇరు దేశాల నౌకాదళాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..సింబెక్స్ సిల్వర్ జూబ్లీ లోగోను ఆవిష్కరిస్తున్న ఇరు దేశాల నౌకాదళ ప్రధానాధికారులు