ఆంధ్రప్రదేశ్‌

పుష్కర మృతులకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 14: గోదావరి మహా పుష్కరాల ప్రారంభం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో సంభవించిన తొక్కిసలాటలో మృతిచెందిన వారికి గురువారం ఘన నివాళి అర్పించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నగరంలో సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. తొక్కిసలాట జరిగిన పుష్కర ఘాట్‌లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గోదావరిలో పిండప్రదానం చేశారు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఆ నాటి విషాద ఘటనను జ్ఞాపకం చేసుకుంటూ పుష్కర ఘాట్ వద్ద విషాద వీచికలు వీచాయి. వివిధ ప్రజాసంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో మృతులకు నివాళి అర్పించారు. గులాబీలు చేతపట్టుకుని సాగిన ర్యాలీ స్థానిక గోకవరం బస్టాండు నుంచి మొదలై దుర్ఘటన జరిగిన పుష్కర ఘాట్ వరకు సాగింది. కొవ్వొత్తులు వెలిగించి పుష్పగుచ్ఛాలు వుంచి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసిపి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, షర్మిలారెడ్డి, సిపిఎం అర్బన్ జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సిపిఐ నాయకులు మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, కాంగ్రెస్ నాయకుడు ఎన్‌వి శ్రీనివాస్, మహిళా నాయకులు యడ్ల లక్ష్మి, సావిత్రి, నల్లా భ్రమరాంబిక పాల్గొన్నారు.

చిత్రం.. పుష్కర మృతులకు నివాళిగా నిర్వహించిన ర్యాలీ