ఆంధ్రప్రదేశ్‌

రైతుమిత్ర ఫెర్టిలైజర్స్‌పై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 14: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపిచంద్‌కు చెందిన రైతుమిత్ర ఫెర్టిలైజర్స్ కంపెనీపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మిశ్రమ ఎరువుల తయారీలో ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడాన్ని గుర్తించిన అధికారులు ఆరు రకాల ఉత్పత్తులను సీజ్ చేశారు.
సేకరించిన వివరాల ప్రకారం పట్టణ శివారు ప్రాంతమైన కోన రోడ్డులోని రైతుమిత్ర ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో సంబంధిత యాజమాన్యం ప్రభుత్వ ఫార్ములాకు భిన్నంగా ఎరువులు తయారు చేస్తోందన్న ఫిర్యాదు మేరకు విజిలెన్స్ డిఎస్పీ ఆర్ విజయపాల్ నేతృత్వంలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల క్రితమే విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టిడిపి నేత గొర్రిపాటి గోపిచంద్ అందుబాటులో లేకపోవటంతో లైసెన్సు, రికార్డులను చూపలేకపోయారు.
దీంతో గురువారం మళ్లీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఎరువుల తయారీలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. 17:17:17, 20:20:0, 22:0:11, 14:35:14, 19:19:19, 10:26:26 రకాలకు చెందిన మొత్తం 408.800 టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు తనిఖీల్లో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి కంచర్ల శివప్రసాద్ విలేఖర్లకు తెలిపారు. సీజ్ చేసిన సరుకు విలువ రూ.84 లక్షల 59 వేల 300లు ఉంటుందన్నారు. ఎరువుల తయారీలో ఉపయోగించాల్సిన మిశ్రమాన్ని మోతాదుకు లోబడి వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. యూరియాలో 21.84 టన్నులు అధికంగా వాడారని, డిఎపి 46.83 టన్నులు తక్కువగా వాడారని, ఎంఓపిలో 27.10 టన్నులు తక్కువగా వాడినట్లు గుర్తించామన్నారు. శాంపిల్స్‌ను సేకరించి సంబంధిత ఫ్యాక్టరీ యజమానిపై 6ఎ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎడి సిహెచ్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎఇఓ కూనపరెడ్డి చిత్తరంజన్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలావుండగా రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు అత్యంత సన్నిహితుడైన గొర్రిపాటి గోపిచంద్ ఫ్యాక్టరీలో జరిగిన విజిలెన్స్ దాడి తీవ్ర సంచలనం రేపింది.

చిత్రం.. సీజ్ చేసిన ఎరువులు