ఆంధ్రప్రదేశ్‌

గోదావరి ఉద్ధృతి తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 14: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలోని భద్రాచలంలో గంట గంటకూ నీటి మట్టం వేగంగా తగ్గుతుండటంతో దిగువ ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 41.8 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది. అక్కడ అన్ని ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. అయితే అక్కడి నుండి దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు నీరు చేరుతున్నందున ఇక్కడ గురువారం సాయంత్రం 12.2 అడుగుల నీటి మట్టం నమోదయ్యింది. దీనితో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి 10 లక్షల 96 వేల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి వెళుతున్నాయి. శుక్రవారం ఉదయానికల్లా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించవచ్చు. 11.75 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి నుండి బయటపడుతుంది. ఎగువ భాగంలో వరద ఉద్ధృతి తగ్గడంతో అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలోని దేవీపట్నం, కూనవరం, సీతానగరం, చింతూరు, వి ఆర్ పురం, కుక్కునూరు. వేలేరుపాడు ప్రాంతాల్లోని గ్రామాలు ఇపుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కాటన్ బ్యారేజీకి దిగువ ప్రాంతమైన కోనసీమలోని గోదావరి లంక ప్రాంతాలు మాత్రం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. లంకల్లోని అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల తోటలు నీటమునిగే ఉన్నాయి. సుమారు 10 వేల ఎకరాల విస్తీర్ణంలోని లంక తోటలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల్లో జన జీవనం ఇంకా యథాస్థితికి చేరలేదు. కోనసీమ లంక గ్రామాలు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి.
భద్రాచలం వద్ద
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పూర్తిగా తగ్గింది. అన్ని ప్రమాద హెచ్చరికలను ఉపసంహరిస్తూ ఐటీడీఏ పీఓ, ఇంచార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు గురువారం ప్రకటించారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కంటే తక్కువకు రాగానే మధ్యాహ్నం 2 గంటలకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరదలు తగ్గిన వెంటనే ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు, పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని అన్ని మండలాల అధికారులను ఆయన ఆదేశించారు.

చిత్రం.. ధవళేశ్వరం బ్యారేజీ నుండి సముద్రంలోకి విడుదలచేస్తున్న వరద జలాలు