ఆంధ్రప్రదేశ్‌

అంత భూమి అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: బందరు పోర్టు నిర్మాణానికి భారీ ఎత్తున భూమిని సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోర్టు నిర్మాణానికి, పోర్టు ఆథారిత పరిశ్రమల కారిడార్ కోసం ప్రభుత్వం 10 వేల ఎకరాలకుతోడు, రైతుల నుంచి 20 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. పోర్టుకు కావల్సిన భూమి రైతులు ఇవ్వకపోతే, పోర్టు వేరే చోటికి తరలిపోతుందని ప్రభుత్వ పెద్దలు ఓపక్క సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బందరు పోర్టును అవసరాల మేరకు అభివృద్ధి చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. పోర్టుకు సమీపంలోని గిలకదిండి వద్ద ఫిషింగ్ హార్బర్‌ను నామమాత్రంగా అభివృద్ధి చేశారు తప్ప, పోర్టు ప్రగతికి అడుగులు పడలేదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పోర్టు అభివృద్ధి చేయాలనుకున్న సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఇఓఐ) కోరారు. దీంతో మైటాస్ ఇన్‌ఫ్రాస్చ్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బిల్డ్ ఆపరేట్ షేర్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిన నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. కృత్తివెన్ను సమీంలో గోగిలేరు వద్ద పోర్టు నిర్మించాలనుకున్నారు. దీనిపై ఆందోళనలు జరగడంతో బందరు వద్దే పోర్టు నిర్మించాలని మైటాస్ నిర్ణయించింది. స్థల మార్పునకు అయ్యే అదనపు ఖర్చు 330 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి పరిస్థితుల్లో మైటాస్ ఆర్థిక ఇబ్బందులో పడడంతో దాని స్థానంలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు 2010లో అప్పటి ప్రభుత్వం రివైజ్డ్ కన్‌షినల్ అగ్రిమెంట్‌ను అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. మొదట్లో మైటాస్‌కు ఇస్తామన్న 6262 ఎకరాల భూమిని తమకు కూడా ఇస్తేనే పనులు ప్రారంభిస్తామని నవయుగ మెలిక పెట్టింది. ఈ స్థితిలో డైరక్టర్ ఆఫ్ పోర్ట్స్ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారం స్టీల్ ప్లాంట్, పవర్ ప్లాంట్, మల్టీ పర్పస్ ఎస్‌ఇజెడ్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, డీసాలినేషన్ ప్రాజెక్ట్, కంటైనర్ టెర్మినల్ స్టేషన్ తదితరాల కోసం 4000 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొంది. కేవలం పోర్టుకు 761 ఎకరాలే సరిపోతుందని కూడా పేర్కొంది. దీంతో నవయుగ సంస్థ ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్‌కు ఈ విషయాన్ని తెలియచేసింది. పోర్టు అభివృద్ధికి 4800 ఎకరాలు అవసరమవుతాయన్న నవయుగ వాదనను డైరక్టర్ ఆఫ్ పోర్టు ఆమోదించింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోర్టు అభివృద్ధికి 5324 ఎకరాలను కేటాయిస్తూ, జిఓ జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రఘునందన్‌రావు ఉండగా ప్రభుత్వ అధీనంలో ఉన్న 2300 ఎకరాలు, రైతుల నుంచి 2900 ఎకరాలను 2013 భూ సేకరణ చట్టం కింద సేకరించడానికి 650 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు భూ సమీకరణ కింద 20 వేల ఎకరాలను పోర్టు అభృవృద్ధి కోసం ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదు.
మచిలీపట్నం పోర్టుకు అవసరానికి మించి భూమిని సేకరించాలని చూస్తున్నారు. మచిలీపట్నం పోర్టు వద్ద మూడు బెర్త్‌లతో 12.8 మీటర్ల లోతుతో నేవిగేషన్ ఛానల్ ఏర్పాటు అవుతోంది. పోర్టు డవలపర్ చెపుతున్నట్టు మచిలీపట్నం పోర్టు నుంచి సంవత్సరానికి 270 మిలియన్ టన్నుల సరుకును హ్యాండిల్ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెపుతున్నారు. ఈ పోర్టు సామర్థ్యం గరిష్ఠంగా హా160 మిలియన్ టన్నులు మాత్రమే. అందువలన మచిలీపట్నం పోర్టు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ చెప్పినట్టు 4800 ఎరకాలే సరిపోతుందని చెపుతున్నారు.
ఇక రాష్ట్రంలో మైనర్, మేజర్, ప్రైవేటు పోర్టులకు ప్రభుత్వాలు కేటాయించిన స్థలాల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే. గంగవరం పోర్టును 1800 ఎకరాల్లో నిర్మించారు. అలాగే చెన్నై పోర్టును 500 ఎకరాల్లో, ఎన్నూరు పోర్టును 2000 ఎకరాల్లో, ట్యూటికోరిన్ పోర్టును 2150 ఎకరాల్లో, కొచ్చిన పోర్టును 2000 ఎకరాల్లో, న్యూ మంగుళూరు పోర్టును 1908 ఎకరాల్లో, మర్మగోవా పోర్టును 530 ఎకరాల్లో నిర్మాంచారు. మచిలీపట్నం పోర్టును 2300 సరిపోతుందని కృష్ణా జిల్లా గత కలెక్టర్ సూచించినట్టు ఆమేరకు మాత్రమే భూసేకరణ చేయడం సమంజసం.

చిత్రం.. పోర్టు నిర్మించేది ఇక్కడే