ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 22: రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలశాఖామంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. గురువారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రాష్ట్రం పారిశ్రామికంగా ఎదుగుతూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్రం కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే సీబీఐ, ఇన్‌కాంట్యాక్స్ దాడులు ప్రయోగిస్తూ పెట్టుబడి దారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను దగా చేసిన బీజేపీ నేడు రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన వైసీపీ, జనసేనతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో వైసీపీ, జనసేన పార్టీలు పోటీ చేయకపోవడంలో మర్మమేమిటని ప్రశ్నించారు.
నేడు రాష్ట్ర రాజధానిలో 20వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారన్నారు. ఇది గొప్ప పరిణామమన్నారు. రాష్ట్రంలో బీజేపీతో వైసీపీ, జనసేనలు కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను దగా చేసే ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.