ఆంధ్రప్రదేశ్‌

బహుజన లెఫ్ట్ ఫ్రంటే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 22: కేంద్రంలో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అటువంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఆమె అన్నారు. తెలంగాణలో ఇప్పుడు కావాల్సింది పేదలకు, కార్మికులకు, రైతులకు, యువతకు మేలు చేకూర్చే ప్రత్యామ్నాయ విధానాలేనని చెప్పారు. తెలంగాణలో నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఉందని తెలిపారు.
భద్రాచలం పర్యటనలో భాగంగా స్థానిక సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో బృందాకారత్ మాట్లాడారు. ప్రజలు పాలించమని అధికారం ఇస్తే ప్రజాభిప్రాయం తీసుకోకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. బీజేపీని, టీఆర్‌ఎస్‌ను అడ్డుకోకుంటే తీవ్ర దుష్ఫలితాలు ఎదురవుతాయని, ప్రజలు నిలదీయాల్సిన తరుణం వచ్చిందన్నారు.
కేంద్రంలోని బీజేపీతో తెలంగాణలో కేసీఆర్ రాజకీయ ఒప్పందం చేసుకున్నారని, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా కేసీఆర్ రాజకీయ భవిష్యత్ కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లారని దుయ్యబట్టారు. దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు చూస్తున్న ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఎవరు కోరితే ముందస్తు ఎన్నికలకు వెళ్లారో చెప్పే ధైర్యం టీఆర్‌ఎస్‌కు ఉందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఏకవ్యక్తి నియంతృత్వం దిశగా అడుగులు పడతాయని, ఈ పరిణామం వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. మహిళా సాధికారత తెలంగాణలో మాటల్లోనే కనిపిస్తుందని, క్యాబినేట్‌లో కేసీఆర్ ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఎటువంటి సిద్ధాంతాలు లేని మహాకూటమి అధికార కాంక్షకు నిలువెత్తు ప్రతిబింబమని ఆమె విమర్శించారు. తెలంగాణలో ఈ పరిస్థితిని మార్పు చేసేందుకు కొత్త నాయకత్వాన్ని అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త నాయకత్వం అంటే కేవలం ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ నాయకత్వం కాదని, ప్రత్యామ్నాయ ప్రజానుకూల విధానాలను ప్రవేశపెట్టి అమలు చేసే నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టాలని కారత్ పిలుపునిచ్చారు.
భద్రాచలం నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వెంకట్, బండారు రవికుమార్, ఏజే రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.