ఆంధ్రప్రదేశ్‌

సమాజాభివృద్ధిలో శాస్తవ్రిజ్ఞానం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 22: సమాజాభివృద్ధికి విద్య, శాస్తవ్రిజ్ఞానం ఎంతో దోహదకారి అని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శి, డీఐఆర్‌ఏసీ అధ్యక్షురాలు రేణుస్వరూప్ పేర్కొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 37వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన రేణుస్వరూప్ మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. అంతరిక్ష ప్రయోగాలు, వ్యవసాయ ఉత్పాదకత, ఆరోగ్య భద్రత, సుజల, ఇంధన, సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకుంటూ అణుశక్తి మొదలు జన్యుశాస్త్రం, కృత్రిమమేథలో దేశం ముందుకు వెళ్తోందన్నారు. బయోటెక్నాలజీ రంగాన్ని మన దేశం ప్రపంచానికి అందించిందని అన్నారు. 800లకు పైగా సంస్థలు దేశవ్యాప్తంగా సుమారు 500 మంది శాస్తవ్రేత్తలకు సహకారం అందిస్తున్నాయని అన్నారు. అదే విధంగా వెయ్యి అంకుర సన్నాహక పరిశ్రమలు, వ్యవస్థాపకులు, విజ్ఞాన పరిశోధకులకు, చిన్నతరహా పరిశ్రమలకు తమ సంస్థ సహకారాన్ని అందిస్తోందని తెలియచేశారు. శాస్ర్తియ పురోగతిలో మహిళలు ప్రత్యేక పాత్ర పోషిస్తారని, మహిళల్లో పట్ట్భద్రుల సంఖ్య పెరుగుదల దానికి దోహదకారి అన్నారు. నైతిక ప్రవర్తన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు సమష్టివృద్ధికి అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. లౌకిక విద్యను ఆధ్యాత్మిక విద్యతో సమ్మిళితం చేసి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ విద్యావిధానాన్ని ప్రశంసించారు. సత్యసాయి బాబా సమాజహితం కోసం ఆదర్శవంతమైన విద్యను విద్యార్థులకు ప్రసాదించడం అదృష్టమన్నారు.
ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం పాటుపడుతున్నారని, వారి సంకల్పానికి బాబా ఆశీస్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, ట్రస్టు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

చిత్రం.. సత్యసాయి డీమ్డ్ వర్శిటీ స్నాతకోత్సవంలో
ప్రసంగిస్తున్న డీఐఆర్‌ఏసీ అధ్యక్షురాలు డాక్టర్ రేణుస్వరూప్