ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండోరోజూ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/చిత్తూరు, నవంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి గత రెండు రోజుల నుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 48 గంటల్లో నెల్లూరు జిల్లాలో గూడూరు, దొరవారిసత్రం మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 76.9 మి.మీ గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 61 మండలాల్లో వర్షం కురిసినట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. అత్యధికంగా ఏర్పేడులో 141.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 61 మండలాల్లో వర్షం కురవగా, తూర్పు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల ప్రభావం ఎక్కుగా ఉన్న 27 మండలాల్లోని పాఠశాలలకు ముందస్తు చర్యగా అధికారులు గురువారం సెలవు ప్రకటించారు. జిల్లాలోని గుడిపల్లి, బి కొత్త కోట, మొలకల చెరువు, పెద్దమండ్యం మండలాలు మినహా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 46.4 మి,మీ వర్షపాతం నమోదు అయ్యింది. వడమాలపేటలో అత్యధికంగా 141.6మిల్లీమీటర్లు నమోదైంది.