ఆంధ్రప్రదేశ్‌

విశాఖ తీరంలోని నాచుతో రోగాలు నయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: విశాఖ తీరంలో లభించే కొన్ని రకాల నాచు రోగాలను నయం చేసే గుణం కలిగి ఉంది. ఇ-కోలి, బాసిల్లస్ సబ్టిలిస్ ద్వారా వచ్చే వ్యాధులకు, కొన్ని రకాల కలుషిత ఆహార సమస్యలకు నాచు ద్వారా పరిష్కారం చూపవచ్చని ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. వాణిజ్య పరంగా ఔషధాన్ని తయారు చేసేందుకు వీలుగా సముద్ర నాచులోని కీలకమైన రసాయనాన్ని వేరు చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాచు, దానిలోని ఔషధ గుణాలపై అధ్యయనం చేశారు. ఈ తరహాలో అధ్యయనాల్లో మొదటిదిగా చెప్పవచ్చు. 11 రకాల నాచు వివిధ రకాల బాక్టీరియాను చంపే గుణం ఉన్నట్లు గుర్తించారు. నాచును మొక్కల ప్రాథమిక దశగా పేర్కొనవచ్చు. లోతైన సముద్ర జలాల్లో, సముద్ర జలాలకు సమాంతరంగా ఉంటే బ్యాక్ వాటర్స్‌లో నాచు ఎక్కువగా ఉంటుంది. ఈ నాచులో స్వల్వ పరిమాణంలో దాదాపు 65 రకాల మూలకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్లు, బ్రోమైడ్, ఐయోడిన్ తదితరాలు ఉంటాయి. కొన్ని రకాల చేపలకు ఈ నాచు గుడ్లు పెట్టేందుకు, ఆహారంగా ఉపయోగపడుతుంది. నాచులోని ఔషధ గుణాలను గుర్తించేందుకు వీలుగా విశాఖ తీరంలో నాచును సేకరించారు. తీరానికి ఎత్తుగా ఉన్న రాళ్లనుంచి, సముద్ర జలాల నుంచి నాచును సేకరించారు. వీటిని పరీక్షించేందుకు ఇథనాల్, మిథనాల్ వంటి రసాయాలతో మిశ్రమాలను తయారు చేశారు. సేకరించిన నాచు నమూనాలను శుభ్రం చేసి సాధారణ ఉష్ణోగ్రతల వద్ద మూడు రోజుల పాటు ఎండబెట్టారు. ఆ తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మరో మూడు రోజుల పాటు ఎండబెట్టారు. ఆ తరువాత వాటిని మెత్తగా చేసి ఇథనాల్ తదిరత ద్రావకాల్లో వేసి వారం రోజులు పాటు ఉంచారు. నాచు మొత్తం కరిగేలా తరచూ కదుపుతూ ఉండటం వల్ల పూర్తిగా కరిగింది. ఆ తరువాత దాని నుంచి ఔషధ గుణం కలిగిన రసాయనాన్ని సేకరించారు. దీనిని ఇ-కోలి, బాసిల్లస్ సబ్టిలిస్ తదితరి బ్యాక్టీరియాపై పరీక్షించారు. ఇది కొన్ని రకాల బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. 11 రకాల నాచుకు కొన్ని రకాల బ్యాక్టీరియాను చంపే గుణం ఉన్నట్లు గుర్తించామని ఆచార్య పి.ఏడుకొండలు తెలిపారు. ఇప్పటికే కొన్ని రకాల సముద్ర మొక్కలు, నాచు వివిధ రకాల వ్యాధుల నియంత్రణ గుణం కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నాచులో ఔషధ గుణం కలిగిన రసాయనాన్ని వేరు చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు.
సిఎంఎఫ్‌ఆర్‌ఐ దృష్టి
ఔషధ విలువలు కలిగిన సముద్ర నాచును ఇప్పటికే వాణిజ్య పరంగా గుజరాత్, తమిళనాడుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ఔషధ విలువలు కలిగిన నాచును ఉత్పత్తికి అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సిఎంఎఫ్‌ఆర్‌ఐ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. గుజరాత్, తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్ర నాచును వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 302, గుజరాత్‌లో 202, ఆంధ్రప్రదేశ్‌లో 78 రకాల నాచు ఉంది. సముద్ర నాచుకు సంబంధించి ప్రపంచ మార్కెట్ దాదాపు 10 బిలియన్ అమెరికన్ డాలర్లు. ప్రపంచంలో ఉన్న 20 వేల రకాల పైచిలుకు ఉన్న నాచు రకాల్లో దేశంలో 844 ఉన్నాయి. ఇప్పటికే దేశంలో పుట్టగొడుగుల ఉత్పత్తి, ద్రవరూపంలో ఎరువుల ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నారు.