ఆంధ్రప్రదేశ్‌

గోదావరి నదికి కార్తీక దీప నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 22: గోదావరి నది తీరం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువారం దేదీప్యమానంగా కాంతులీనింది. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది స్నాన ఘట్టాల్లో అశేష భక్తజనం పవిత్ర గోదావరి నదికి కార్తీక దీప నీరాజనం పలికారు. రాజమహేంద్రవరంలోని పురాణ ప్రాశస్థ్యం కలిగి, ఆసియాలోనే అతి పెద్ద ఘాట్‌గా పేరొందిన స్థానిక కోటిలింగాల ఘాట్‌లో కిలోమీటరున్నర పొడవున మహిళలు లక్ష దీపారాథన నిర్వహించారు. పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వినూత్న దీపారాధన సాగింది.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉపవాస దీక్షలతో భక్తులు కుటుంబ సమేతంగా గోదావరి నది తీరాలకు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరంలోని కోటిలింగేశ్వర, విశే్వశ్వర, మార్కండేయేశ్వర, ఉమా రామలింగేశ్వర క్షేత్రాలను దర్శించుకున్నారు. అంతకు ముందు నదికి కార్తీక దీప నీరాజనం పలికారు. తెల్లవారు జామున గోదావరి స్నానాలతో ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, కోటిలింగాల ఘాట్, సరస్వతి ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.పౌర్ణమి ఉపవాసాలు చేసిన మహిళలు వత్తులు వెలిగించి, దీపారాధన చేసి అభిషేకాలతో దైవ దర్శనం చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని నాలుగు పంచారామ క్షేత్రాలు, పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరస్వామి, అన్నవరం సత్యదేవుని సన్నిధి, కుండలేశ్వరం, క్షణ ముక్తేశ్వరం, కోటిపల్లి, వాడపల్లి, ర్యాలి తదితర క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం పూట చంద్రోదయం తర్వాత నదికి మహిళలు అరటి దొప్పలపై వత్తుల దీపాలతో కార్తీక దీప నీరాజనం పలికారు. దీంతో గోదావరి తీరమంతా దీపాలతో మెరిసిపోయింది. శైవ క్షేత్రాల్లో రాత్రి జ్వాలా తోరణం నిర్వహించారు. ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జ్వాలా తోరణాన్ని దర్శించి తరించారు.

చిత్రం..రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు కార్తీక దీపాలతో కాంతులీనుతున్న దృశ్యం