ఆంధ్రప్రదేశ్‌

జ్ఞాన జ్యోతిని వెలిగించడమే దీపోత్సవ పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 22: భక్తకోటిలో జ్ఞాన జ్యోతిని వెలిగించడమే కార్తీక దీపోత్సవ పరమార్థమని, కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించే కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా చేపట్టినట్లు టీటీడీ ఈ ఓ ఏకే సింఘాల్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు తిరుమల క్షేత్రంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయ బద్దంగానిర్వహించారు. టీటీడీ పెద్ద జీయర్, టీటీడీ ఉన్నతాధికారులు మట్టి మూకుడులో దీపాలను ఉంచుకుని మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి గర్భాలయంలోకి తీసుకు వెళ్లారు. స్వామివారికి నైవేద్యానంతరం ముందుగా గర్భాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వెలిగించారు. అనంతరం ఆలయం అంతటా దీపాలను వెలిగించారు. ఈ క్రమంలో ఓ వైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరో వైపు కార్తీక దీపోత్సవ కాంతులు ఆలయం దేదీప్యమానంగా వెలుగులు నింపింది. ఈసందర్భంగా ఈ ఓ సింఘాల్ మాట్లాడుతూ శివ కేశవులకు భేదం లేదని, అందుకే కార్తీక మాసంలో తిరుమలలో కూడా కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతోందన్నారు. ఇందులో భాగంగా తిరుమలలో 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గర్భాలయం నుంచి ఈ కార్తీక దీపాన్ని వెలిగించి ఆలయం అంతటా అలాగే పుష్కరణి, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయంలో కార్తీక దీపాలను వెలగించినట్లు తెలిపారు. ముందుగాస్వామి వారికి నైవేద్యం నిర్వహించిన అనంతరం మూలవిరాట్లు కొలువుదీరి ఉన్న గర్భాలయంలో కార్తీక దీపాన్ని వెలిగించామన్నారు. అక్కడ నుంచి రాములవారి మేడ, బంగారు వాకిలి వద్ద ఉన్న గరుడాళ్వార్ సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించామన్నారు. అటు తరువాత ఆలయంలోని ఉపాలయాల్లోను, ధ్వజ స్థంభం, రంగనాయకులు మండపం ఇలా ఆలయం అంతటా ఈ కార్తీక దీపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో వెలిగించామన్నారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న ఆలయాలు, పుష్కరణి తదితర ప్రాంతాల్లో కార్తీక దీపాలను వెలిగించామన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సహస్రదీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశామన్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి జ్ఞాన జ్యోతులు వెలిగించడమే ఈ పర్వదిన వేడుకల పరమార్థమన్నారు. ఈకార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ దంపతులు,జేఈఓ శ్రీనివాసరాజు, సీవీ ఎస్వో గోపీనాథ్ జెట్టీ, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, డాలర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.