ఆంధ్రప్రదేశ్‌

నాలుగు లక్షలు దాటిన ‘యువనేస్తం’ అర్హులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: నిరుద్యోగులకు భృతి చెల్లించే ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అర్హుల లెక్క నాలుగు లక్షలు దాటింది. ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకునేలోగా 20 వేల మందిని వివిధ కంపెనీల్లో అప్రంటీస్‌గా చేర్చి, ఆన్‌జాబ్ శిక్షణ ఇవ్వాలని అధికారులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వివిధ కంపెనీలకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధిలో నిరుద్యోగ భృతి పొందుతున్న వారికి ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు.
ముందుగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 1 నుంచి నాలుగు లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. ఇప్పటికే 3.35 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నారు. స్వచ్ఛందంగా 13,701 మంది భృతిని వదులుకున్నారు.
ఇప్పటి వరకూ 1.85 లక్షల ఫిర్యాదులను పరిష్కరించగా, 25,790 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న మిగిలిన వాటికి కూడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు మహిళలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునేలా మహిళా సాధికార మిత్రలతో ఇంటింటికీ ప్రచారం చేయనున్నారు. దేశంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యలో నిరుద్యోగ భృతి చెల్లిస్తున్న రాష్ట్రం లేదు. దరఖాస్తు చేయగానే అప్పటికప్పుడే అర్హులా? కాదా అని చెప్పే విధానం దేశంలో యువనేస్తం పథకంలో మాత్రమే ఉండటం గమనార్హం. పారదర్శకతకు పెద్దపీట వేయడం వల్ల యువతను ఈ పథకం ఆకట్టుకుంటోంది.
పథకం ప్రారంభించిన 70 రోజుల్లోనే భృతికి అర్హులైన వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వారి సర్ట్ఫికెట్ల ధ్రువీకరణ సమస్యగా మారడంతో, విద్యార్హత ధ్రువీకరణకు ప్రత్యేక బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపుతున్నారు. దీంతో ఈ సమస్యను కొంత మేరకు అధిగమించే వీలు కలిగింది. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తుల్లో ఎక్కువ మంది పురుషులే ఉండటంతో, మహిళా నిరుద్యోగులపై మంత్రి దృష్టి సారించారు. వీరిలో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. దరఖాస్తు చేసేందుకు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించనున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకోవడంతో పథకం అమల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 20 వేల మందికి అప్రెంటీస్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.