ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు దమ్ముంటే ఆస్తులు వెల్లడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 22: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి దమ్ముంటే తన ఆస్తులను వెల్లడించాలని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సవాల్ విసిరారు. జగన్‌కు బెంగుళూరులోని ఆస్తులు, హైదరాబాద్‌లో లోటస్ పాండు తదితర ఆస్తులను వెల్లడించే సత్తాలేదన్నారు. నీతి, నిజాయితీ, పరిపాలనాదక్షత కల్గిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కరే తమ ఆస్తుల వివరాలను ఏటికేడాది ప్రకటించగల సత్తా, దమ్ము కల్గిన నాయకుడన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటి లింగాల ఘాట్‌లో పంత సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన కార్తీక లక్ష దీపోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి రూ.43వేల కోట్లు అవినీతికి పాల్పడినట్టు 11 సీబీఐ కేసులు ఎదుర్కొంటూ ప్రతి రోజు పాదయాత్రలో సీఎం అవినీతిపరుడని ప్రచారం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు కుటుంబం గత తొమ్మిదేళ్లుగా తమ ఆస్తులను వెల్లడిస్తూనే ఉందని, ఆ విధంగా ఆస్తులను వెల్లడించే సత్తా, దమ్ము చంద్రబాబుకే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి గురించి ప్రచారం చేసే జగన్మోహన్‌రెడ్డికి తన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియని స్థితి ఉందన్నారు. చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మంచి ఆశయాలు కలిగి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డికి రాష్టమ్రేమైనా ఫర్వాలేదని, తాను మాత్రం ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక ధ్యేయం తప్ప మిగిలిన విషయాలేవీ పట్టించుకోకుండా డ్రామాలాడుతూ పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. అభివృద్ధి పనులు జరిగితే అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారన్నారు. జగన్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మడం లేదని, చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధిని ప్రజలు కళ్లారా చూస్తున్నారు కాబట్టి జగన్ కల్లబొల్లి మాటలను విశ్వసించటం లేదన్నారు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదని, ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి కోట్లు అవినీతి జరిగిందంటే గరిష్ఠస్థాయిలో అభివృద్ధి జరిగిందని భావించవచ్చునన్నారు. పవన్ చెప్పినట్లు ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయల చొప్పున అవినీతి జరిగిందంటే ఇక అభివృద్ధి ఏమీ జరగలేనట్లేనని లెక్క అన్నారు. పవన్‌కు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని, ఆయనకు ఎటువంటి అవగాహనా లేదన్నారు. పవన్ నోటికొచ్చినట్టు మాడ్లాడుతున్నారని, ఎవరైనా కాగితంపై రాసిస్తే అది చదవటం తప్ప అవగాహన లేదన్నారు.