ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలకు సమాయత్తం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: మరో 28 రోజుల్లో కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున అధికారులు ఇప్పటినుంచే అప్రమత్తమై సన్నద్ధంగా ఉండాలంటూ శుక్రవారం రాత్రి సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రణాళికలు రూపొందించుకోవడమే కాక అవన్నీ పక్కాగా అమలయ్యేలా ప్రతి అధికారి దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఘాట్లకు దారితీసే ఏ రహదారికూడా అరకొర పనులతో అసంపూర్తిగా ఉండరాదని హెచ్చరించారు. నగరాల్లో సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో కాలువల సుందరీకరణ పనులు తక్షణం పూర్తి చేయాలంటూ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ, అవసరాలకు తగినట్లుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
కృష్ణా పుష్కరాల కోసం 300 కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు, అదనంగా మరో 400 బస్సులు అందుబాటులో ఉంచామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై మంగళగిరి ఎంవిఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నదని అన్నారు.