ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాల రద్దుకే సర్వే: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 16: పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు తొలగించడానికే ప్రభుత్వం ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తోందని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. అతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే వల్ల నిరుపేదలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కోటి మంది రేషన్‌కార్డులు తొలగించారని, 12 లక్షలకు పైగా పింఛన్లు, ఉపాధి హామీ జాబ్‌కార్డులు తొలగించారన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకే ప్రభుతం ప్రజా సాధికార సర్వే చేపట్టినట్టు స్పష్టమవుతోందన్నారు. అన్ని అవసరాలకు ఆధార్ అనుసంధానం అవసరమని, అయితే దాన్ని అడ్డం పెట్టుకుని మిగతా వాటి గురించి సర్వే చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా పెట్టుబడులు రావన్నారు.