ఆంధ్రప్రదేశ్‌

రేషన్ కార్డుల తొలగింపు అవాస్తవం: సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ఒక కోటీ 35 లక్షల 31వేల మంది అత్యల్ప ఆదాయ వర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులు అందివ్వడం జరిగిందని వీరిలో ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు 17లక్షల 06వేలు వున్నాయని, అయితే వీరిలో 78వేల 029 మంది రేషన్ సరుకులు తీసుకువెళ్లటం లేదని గుర్తించటం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ప్రస్తుతం జరుపుతున్న ఇంటింటికి సర్వేలో అకారణంగా రేషన్ కార్డులను తొలగిస్తున్నారనే ప్రచారం అవాస్తవమన్నారు. అయితే సరుకులు తీసుకువెళ్లని వారి కుటుంబాల గురించి ఆరా తీయటం జరుగుతుందన్నారు. శనివారం నాడిక్కడ మంత్రి సునీత 13 జిల్లాల పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కాలంగా ఈ-పోస్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వాస్తవ లబ్దిదారులకు సరుకులు అందించటం ద్వారా మూడుపూటలా ఆహారం అందించాలనే నిశ్చయంతోనే సాంకేతిక విధానానికి స్వీకారం చుట్టామన్నారు.