ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి నిరోధకులు వైకాపా నేతలు: చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 16: వైకాపా నాయకులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప ఆరోపించారు. శనివారం ఇక్కడి ఎమ్మెల్యే మీసాల గీత స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీ నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదన్నారు. గడపగడపకూ వైకాపా పేరుతో ఆ పార్టీ నేతలకు ప్రజల్లో అసలు విలువే లేదన్నారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఖాళీగా ఉన్నారని, రోజూ ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శలు చేయడం అలవాటుగా చేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్టమ్రంత్రిగా పదేళ్లపాటు ఉన్న బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 11 కేసులలో ముద్దాయిగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.