ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనుల్లో అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 6: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరుగుతోందని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో చిలకపాలెం కూడలిలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పోలవరం పూర్తిచేస్తామని చంద్రబాబు బాకా ఊదుకుంటున్నారని, పునాదులే పూర్తికాలేదని ఆయన విమర్శించారు. వీటి నిర్మాణ పనులు మంత్రి యనమల రామకృష్ణుడుకు సబ్ కాంట్రాక్టర్‌గా పనులు అప్పగించడం వెనుక ఏ స్థాయిలో అవినీతి ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పిరాయింపు ఎమ్మెల్మేలను ఓడించాలని తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రసంగించిన బాబు ఆంధ్రాలో 23మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. తోటపల్లికి చంద్రబాబు పునాదిరాయి వేస్తే దివంగత వైఎస్ 90 శాతం పనులు పూర్తిచేశారన్నారు. పైడిభీమవరం పారిశ్రామిక వాడలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటుచేయలేదని, ఏడు పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. మంత్రి కళావెంకటరావు ఒక రాజకీయ దళారని, విపక్ష ఎమ్మెల్యేలను కొనేలా బేరసారాలకు మధ్యవర్తిత్వం నెరుపుతారని విమర్శించారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేసి బినామీలకు చౌకగా కట్టబెట్టారన్నారు. మొబైల్‌ను, కంప్యూటర్‌ను కనిపెట్టానని మాయమాటలు చెబుతున్న ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడాలన్నారు. అంబేద్కర్ విశ్వ విద్యాలయం వైఎస్ ఏర్పాటుచేస్తే ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకు చేయకుండా విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. జిల్లాకు మంజూరుచేసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నూజివీడులో చదవాల్సిన దయనీయ పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మీరంతా ఆశీర్వదించి తనను సీఎం చేస్తే 60 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని, నెలకు రూ.2 వేలు అందజేస్తామని హామీలు గుప్పించారు. మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ, గొర్లెకిరణ్‌కుమార్, బెల్లాన చంద్రశేఖర్, రెడ్డిశాంతి, బొత్స ఝాన్సీలక్ష్మి, మజ్జిశ్రీనివాసరావుజగన్ వెంట ఉన్నారు.అంతకుముందు ఆమదాలవలస నియోజకవర్గం రెడ్డిపేట శివారులోని శిబిరం నుంచి జగన్ గురువారం పాదయాత్రను ప్రారంభించారు. శిబిరం ప్రారంభానికి ముందు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాలతో ఆయనకు నివాళులు అర్పించారు.