ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి విశాఖలో ప్రో కబడ్డీ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), డిసెంబర్ 6: ప్రో కబడ్డీ సీజన్ 6 పోటీలకు రంగం సిద్ధమైంది. విశాఖలో డిసెంబర్ 7 నుంచి వారం రోజుల పాటు జరగునున్న ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం జిలుగు వెలుగులతో ముస్తాబైంది. పోటీల్లో పాల్గొంటున్న తెలుగు టైటాన్స్‌తో పాటు గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్, పాట్నా పైరేట్స్, పునేరీ పల్టాన్, యుముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు ఇప్పటికే విశాఖ చేరుకుని ఆంధ్రయూనివర్శిటీలో కొత్తగా నిర్మించిన ఇండోర్ హాల్‌లో సాధన చేశాయి. విశాఖలో జరిగిన ప్రతి సారి తెలుగు టైటాన్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరచిన సంగతి విధితమేనని, ఈ సీజన్‌లో కూడా సొంతగడ్డపై తన సత్తా చాటుతుందని ఆ జట్టు సీఈఓ పవన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో జరిగే ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైందని, ఇక్కడ జరిగే ఆరు మ్యాచ్‌లలో కనీసం ఐదు మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుందని టైటాన్స్ జట్టు కెప్టెన్ విశాల్ భరద్వాజ్ గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో పటిష్టమైన గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ జట్టుపై గెలిచి శుభారంభం చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు.
నేటి మ్యాచ్‌లు: 8.00 గంటలకు తెలుగు టైటాన్స్ * గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ 9.00 గంటలకు పాట్నా పైరేట్స్ * పునేరీ పల్టాన్