ఆంధ్రప్రదేశ్‌

కోర్టు కేసుల వల్లే జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 16: సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారంలో జాప్యం వాస్తవమేనని, న్యాయస్థానంలో చిక్కుల వల్లే పరిష్కారం ఆలస్యం అవుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో సింహాచలం భూ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఇచ్చిన హామీపై ఆయన విశాఖలో శనివారం విలేఖరుల వద్ద స్పందించారు. పాత జిఓ ప్రకారం సింహాచలం భూ సమస్యకు పరిష్కారం తీసుకోవాలని భావించినప్పటికీ న్యాయ పరమైన అంశాలు అడ్డంకిగా మారాయన్నారు. దేవాదాయ భూములు రెగ్యులరైజ్ చేసే అంశంలో కొన్ని న్యాయ పరమైన చిక్కులున్నాయని, తీసుకున్న భూమికి బదులుగా అంతే భూమితో పాటు అంతే విలువైన భూములు ప్రభుత్వం దేవస్థానానికి బదలాయించాల్సి ఉందన్నారు. ఈ అంశం పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించి, త్వరలోనే ఒక పరిష్కారం లభించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖ నగరం, శివార్లలో ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి, అర్హులకే లబ్దిచేకూరేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కొంతమంది దళారులు జోక్యం చేసుకుని, భూముల క్రమబద్దీకరణ పేరిట దందాలు చేస్తున్నారని విలేఖరులు మంత్రి దృష్టికి తీసుకురాగా, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారి స్థలాలను మాత్రమే క్రమబద్దీకరించే విధంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. భీమిలి నియోజకవర్గంలోని చేపల తిమ్మాపురంలో ఇళ్ల కూల్చివేతకు సంబంధించి పలువురు బాధితులు విశాఖ సర్కూట్ హౌస్‌లో మంత్రి గంటాను నిలదీసేందుకు వచ్చారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారి వద్దనున్న ఆధారాలు పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18న జరిగే గిరిప్రదక్షణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. గిరి ప్రదక్షణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, నగర పోలీసు కమిషనర్ యోగానంద్, ఇవో రామచంద్రమోహన్‌లను ఆదేశించారు.