ఆంధ్రప్రదేశ్‌

‘జగ్జీవన్ జ్యోతి’ సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు వర్తింప చేస్తున్న జగ్జీవన్ జ్యోతి పథకం సక్రమంగా అమల చేయకపోతే చర్యలు తప్పవని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ హెచ్చరించారు. ఈ పథకం అమలుపై గురువారం ఆయన డిస్కంల సీఎండీ, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని పేద ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు కొన్ని యూనిట్ల మేరకు రాయితీ ఇస్తున్నామన్నారు. తొలుత 75 యూనిట్లుగా ఉన్నప్పటికీ, 100 యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. దాదాపు 11 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను రాయితీగా భరిస్తోందన్నారు. ఈ పథకం అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అయా లైన్లు మెన్లు, ఏఈలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిస్కంల సీఎండీలు ఈ పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు కూడా ఈ విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.