ఆంధ్రప్రదేశ్‌

ఓఎన్జీసీ స్వచ్ఛ సోలార్ టాయిలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 11: రాష్ట్రంలోనే తొలిసారిగా ఓఎన్జీసీ స్వచ్ఛ సోలార్ టాయిలెట్స్‌ను ఏర్పాటుచేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో బుధవారం సోలార్ టాయ్‌లెట్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే కృష్ణా-గోదావరి బేసిన్ పరిధిలో మొత్తం 10 రైల్వే స్టేషన్లలో ఆ టాయిలెట్స్‌ను నిర్మించడానికి ఓఎన్జీసీ కార్యాచరణ చేపట్టింది. రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 13 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ నెలకొల్పుతున్నారు. ఇందులో ఒక యూనిట్ నరసాపురంలో నెలకొల్పుతున్నారు. మరో పది కేజీ బేసిన్ పరిధిలోని పది రైల్వే స్టేషన్లలో నెలకొల్పుతారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం ఒక కీలక పట్టణంగావుంది. రెండు ప్రధాన రోడ్ల ప్రాంతాల్లోనే వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి. సినిమాహాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు తదితరాలతో జనం నిత్యం రద్దీగావుండే ఈ ప్రాంతంలో మరుగు సదుపాయం లేకపోవడాన్ని గుర్తించిన ఓఎన్జీసీ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ స్వచ్ఛ సోలార్ టాయిలెట్స్‌ను ఆధునిక విధానంలో ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. నర్సాపురం పట్టణానికి చుట్టుపక్కల నుంచి సుమారు 30 నుంచి 40వేల మంది గ్రామస్థులు వివిధ అవసరాల రీత్యా వస్తూ, పోతూవుంటారు. షాపింగ్ నిమిత్తం వచ్చే మహిళలు, పురుషులు, వికలాంగులు, షాపుల్లో పనిచేసే మహిళలు మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంవల్ల నానా అవస్థలు పడుతుంటారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఆధునిక విధానంలో స్వచ్ఛ సోలార్ మరుగుదొడ్లను నిర్మించింది. నర్సాపురం పట్టణంలో వీటిని ఓఎన్జీసీ స్వచ్ఛ సోలార్ టాయిలెట్స్ పేరుతో తొలి విడతగా ఏర్పాటుచేశామని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-అసెట్ మేనేజర్ డీఎంఆర్ శేఖర్ మంగళవారం తెలిపారు. సౌరశక్తి ఆధారంగా ఆ టాయిలెట్స్ నిర్వహణ ఉంటుంది. లైట్లు, నిరంతర నీటి సరఫరా విధానంలో నిర్వహిస్తారు. డిఫెన్స్ రీసెర్చి అండ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)) నాణ్యత ధృవీకరణ చేసింది. ఏపీలో మొట్టమొదటి సారిగా వినియోగంలోకి వస్తోంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉపయోగించుకునేలా రెండేసి బ్లాకులుగా నిర్మించారు. వికలాంగులకు కూడా సదుపాయంగా వుండే విధంగా డిజైన్‌చేశారు. దీనితో పాటు శానిటరీ నేప్‌కిన్స్ సదుపాయం ఏర్పాటుచేశారు. త్వరలో నేప్‌కిన్ వెండింగ్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ్లష్ ట్యాంకు, ఆటోమేటిక్‌గా నిండే ఓవర్‌హెడ్ ట్యాంకు, లైటింగ్ సదుపాయంతో పగలూ, రాత్రీ వినియోగించుకునే విధంగా నిర్మించారు. మిగిలిన టాయిలెట్స్‌తో పోల్చితే నీరు ఏభై శాతం ఆదా అవుతుంది. 8 నుంచి 10 లీటర్ల నీరు అవసరమైతే ఇందులో సగం నీటి అవసరాలతోనే సరిపోయే విధంగా ఆధునిక విధానంలో ఈ మరుగుదొడ్లు నిర్మించారు. రానున్న రెండు నెలల్లో కేజీ బేసిన్ పరిధిలోని 10 రైల్వే స్టేషన్లలో ఒక్కోటి రూ.కోటి వ్యయంతో సోలార్ టాయిలెట్స్ నిర్మాణానికి ఓఎన్జీసీ ప్రణాళిక చేపట్టింది.
చమురు, సహజవాయును వెలికితీసి జాతి సౌభాగ్యానికి దోహదపడుతున్న ఓఎన్జీసీ తన కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధికి పలువిధాలుగా చేయూతనిస్తోంది. ఓఎన్జీసీ సీఎస్‌ఆర్ నిధులతో ప్రజోపయోగకర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మరోవైపు కేంద్ర పధకాల అమలులో భాగస్వామ్యమవుతోంది. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్‌గా డిఎంఆర్ శేఖర్ అసెట్ కార్యకలాపాలు సాగించే ప్రాంతాలతో పాటు, ఇతర ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాజమహేంద్రవరం అసెట్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం రూ.32 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.36 కోట్లను ఖర్చుచేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.

చిత్రం..ఓఎన్జీసీ నెలకొల్పుతున్న స్వచ్ఛ సోలార్ టాయిలెట్స్