ఆంధ్రప్రదేశ్‌

జాతీయస్థాయి గణిత పోటీల విజేతలు వీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 13: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన రామానుజన్ గణిత అకాడమీ ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి గణిత పోటీల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విజేతల వివరాలను అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేవీవీ సత్యనారాయణ వెల్లడించారు. నాలుగో తరగతి విభాగంలో ఏలూరు కేకేఆర్ గౌతమ్ స్కూలు విద్యార్థిని మణిప్రియ, గుంటూరు జీఎస్సార్ హైస్కూలు విద్యార్థి సీహెచ్ గౌతమ్‌లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 5వ తరగతి విభాగంలో కర్నూలు ఎన్‌ఆర్ పేట భాష్యం విద్యార్థులు హాసిని, శ్రీనాథ్‌లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 5వ తరగతి విభాగంలో గుడివాడ కేకేఆర్ గౌతమ్ విద్యార్థి ఎం హన్నా ద్వితీయస్థానం సాధించింది. 6వ తరగతి విభాగంలో అనంతపూర్ జీవానంద స్కూలు విద్యార్థి బి నందిని, హైదరాబాద్ వీవీఎన్ కాలనీ భాష్యం స్కూలు విద్యార్థిని వి లక్ష్మీప్రియ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 7వ తరగతి విభాగంలో హైదరాబాద్ వీవీఎన్ కాలనీ భాష్యం స్కూలు విద్యార్థి మహ్మద్ ఆఫ్తాబ్, తూర్పుగోదావరి జిల్లా కాతేరు తిరుమల హైస్కూలు విద్యార్థి సి సత్యహర్షత్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 8వ తరగతి విభాగంలో హైదరాబాద్ విజయాస్ విబ్జియార్ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థి ఎం మితిన్‌గౌడ్, నల్గొండ జిల్లా సూర్యారావుపేట జయ ఐఐటీ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థి లిఖిత్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 9వ తరగతి విభాగంలో కాకినాడ శాంతినగర్ భాష్యం స్కూలు విద్యార్థి టి ఆశా, కాతేరు తిరుమల స్కూలు విద్యార్థి ఆర్‌ఎస్ సత్యమేష్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. పదవ తరగతి విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య పబ్లిక్ స్కూలు విద్యార్థులు ఎన్‌వీ సాయినేహ, ఎల్ శ్రీరామ అభంతలు ప్రథమస్థానాన్ని, నరసాపురం ఆదిత్య పబ్లిక్ స్కూలు విద్యార్థి టి రేచెల్‌లు ద్వితీయ స్థానం సాధించారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కె శ్రీకృష్ణసాయి, మానేపల్లి నాగార్జున, ముమ్మిడి సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.