ఆంధ్రప్రదేశ్‌

టాటా వింగర్ 12, 15 సీటర్ వాహనాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: భారతదేశంలో అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ టాటా నూతనంగా తయారు చేసిన వింగ్ 12,15సీటర్స్ వాహనాలను తిరుపతిలోని టాటా షోరూంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెనెస్ యూనిట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ సందీప్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో అన్ని నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి ట్రాఫిక్‌కు, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాటా వింగ్ 12 ఎస్, వింగ్ 15 ఎస్ వాహన శ్రేణిని రూపొందించామన్నారు. తక్కువ ఇంధన ఖర్చుతో టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పెద్ద కుటుంబాల ప్రయాణానికి, వ్యాపారసంస్థల రవాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంధన ఆదా కోసం వీలుగా వింగ్ వాహనాలు టాటా మోటార్స్ డికార్ ఇంజిన్‌తో శక్తివంతంగా రూపొందించామన్నారు. 100 హెచ్‌పీ , 190 ఎన్ ఎం ప్లాట్ టార్ క్యూర్ కలిగి ఉంటాయన్నారు. తక్కువ ఆర్‌పీఎంల వద్ద కూడా మరింత గొప్పగా లాగే శక్తిని అందిస్తాయన్నారు. ఈ వాహనాలు ఫ్రంట్ ఇండిపెండెంట్ ఎంసీ ఫెర్సన్ స్ట్రెయిట్ సస్పెన్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయన్నారు. మెరుగైన ప్రయాణ అనుభూతిని ఇంది అందిస్తుందన్నారు. ఈ వాహనాలు ఫ్రంట్ యాక్సిల్ డ్రైవ్‌ను కలిగి ఉంటాయన్నారు. తద్వారా కారు తరహాలో అతి తక్కువ శబ్దంతో నాయిస్ వైబ్రేషన్ హార్స్ నెస్‌ను అందిస్తుందన్నారు. 15 ఇంచీల టైర్లు అమర్చామన్నారు. వాహనం అత్యంత ఆకర్షణీయంగా ఉండి, వాహన ప్రియులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.