ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయరంగ అభివృద్ధిపై రెండు రోజుల్లో శే్వతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 14: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులపై రెండు రోజుల్లో శే్వతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు ఏదో చేసానని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఆయన తెలంగాణకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఆదాయం కలిగిన తెలంగాణ కంటే ఎక్కువ రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో మరోసారి సెంటిమెంటును రెచ్చగొట్టి కేసీఆర్ గెలిచారని అన్నారు. ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న కేసీఆర్, హరీష్‌రావు వంటి నేతలకు జనసేన, వైసీపీ నాయకులు మద్దతు పలకడం దారుణమని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారితో ఈ నాయకుల స్నేహాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలకు సెంటిమెంటు ఉందని, అలాగే ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా సెంటిమెంటు ఉంటుందని, అదేంటో, ఏ స్థాయిలో ఉంటుందో త్వరలో చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లంకు జగన్మోహన్‌రెడ్డిపై ప్రేమ పుట్టుకొచ్చిందని, సర్వీసులో ఉన్న సమయంలో ఆయనతో పాటు మరో మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కేబినెట్ సమావేశాల్లోనూ, ఇతర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిని పొగిడేవారని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణ పనులపై ఆయన విమర్శలు చేయడం సిగ్గుచేటని, గతంలో ఎంత పని జరిగింది, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంత పని జరిగింది ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈనెల 30న జరగనున్న బీసీ గర్జన సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.