ఆంధ్రప్రదేశ్‌

6న గుంటూరులో మోదీ బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 16: జనవరి 6వ తేదీన గుంటూరులో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని బహిరంగ సభకు సంబంధించి ఈ నెల 18వ తేదీన గుంటూరులో కోర్ కమిటీ సమావేశం జరగనుందని, ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు హాజరై మోదీ సభపై సమీక్షిస్తారని, ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించి చర్చించడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, రాయలసీమలో కూడా మోదీ సభలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ప్రధాని రావాల్సి ఉందని, ఇక్కడ జరుగుతున్న తప్పుడు ప్రచారానికి సరైన సమాధానం మోదీ ద్వారా ప్రజలకు తెలియజేయించాలనే ప్రయత్నమన్నారు.
హామీలన్నీ తీర్చేశామని, ఇక తీర్చడానికేమీ లేవని, ఏపీలో బీజేపీ ద్వారా జరుగుతోన్న అభివృద్ధిపై వివరించడం జరుగుతుందన్నారు. బీజేపీ ఇంటింటికీ వెళ్లి చెబుతున్నామని, బీజేపీ ఏమి చేసిందో చెబుతుంటే ప్రజలంతా ప్రశాంతంగా వింటున్నారని, ప్రజలకు తాము ఏమి చెబుతున్నామనేది అర్ధమైందని, బీజేపీని చంద్రబాబునాయుడు పూర్తిగా ప్రజావ్యతిరేకం చేశారనే విషయం అవాస్తవమని తేలిందన్నారు. ప్రధాని ద్వారా ఈ అంశాలను తెరపైకి తెచ్చేందుకే ఏపీకి వస్తున్నారన్నారు. ఏపీ స్మార్ట్ సిటీలకు రూ.887 కోట్లు కేంద్రం ఇస్తే, అందులో రూ.517 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టుకోగలిగారన్నారు. అమరావతిలో పెట్రోల్ సెస్ ద్వారా రూ.11వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా రూ.2వేల కోట్లు సమీకరించడం ఈ నిధులన్నీ ఏమయ్యాయో ఏపీ తెలియజేయాల్సి ఉందని సోము వీర్రాజు అన్నారు.