ఆంధ్రప్రదేశ్‌

చదువుల రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: అమరావతి ప్రజా రాజధాని అంటూ ఏపీ సర్కారు చెబుతున్న మాటలు అక్షర సత్యాలు కాబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెబుతున్నట్టుగా అమరావతి అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, వినోదం, పరిశ్రమలు.. అన్నీ కలబోతగా ఉండాలన్న లక్ష్యం దిశగా ఇప్పుడు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతిలో విద్యాసంస్థల భూకేటాయింపులకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటు కోసం 455 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. విద్యాసంస్థల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలించాల్సిందిగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-సీఆర్‌డిఏ)ను ప్రభుత్వం ఆదేశించింది. విద్య, వైద్యానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పాలనే పట్టుదలతో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు తగినవిధంగా అడుగులు వేస్తున్నారు. ఉద్యోగ కల్పనతో పాటు ఇతర పరిశ్రమలు అమరావతికి తరలివచ్చేలా దీర్ఘకాలిక కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అమరావతిలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి ఆరు సంస్థలకు భూములను ప్రభుత్వం అనేక షరతులకు లోబడి కేటాయించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండో-యుకె హెల్త్ సంస్థకు 150 ఎకరాలు, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కి 200 ఎకరాలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (నిడ్)కు 50 ఎకరాలు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపి మానవ అభివృద్ధి వనరుల కేంద్రానికి 25 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సిఐటిడి)కి 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. నవ్యాంధ్ర రాజధానిలో కేంద్రం ఏర్పాటు చేయాలనుకునే ఏ సంస్థకైనా భూములను ఉచితంగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇతర ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎకరా భూమిని రూ.50 లక్షల చొప్పున రేటుకు కేటాయిస్తున్నారు.
రాజధాని అమరావతి భూకేటాయింపులకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సూచనల మేరకు ఆయా సంస్థలకు భూములు మంజూరు చేశారు. మొత్తం 11 సంస్థలు రాజధానిలో తమ శాఖల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించగా ఇప్పటివరకు ఆరు ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇండో-యూకె హెల్త్ సంస్థ, విట్‌కు భూకేటాయింపు విషయమై ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. పేదలకు సేవ చేయడం, పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన, విద్యావకాశాలు కల్పించాలనే నిబంధనలు విధించింది. అమరావతిలో నిర్మించే ఆసుపత్రిలో 20 శాతం పడకలను దారిద్య్రరేఖకు దిగువన వున్నవారికి ఉచితంగా అందించాల్సి వుంటుంది. ఇండో-యూకె హెల్త్ సంస్థ తరహాలోనే వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి భూకేటాయింపు చేశారు. విట్‌కి కేటాయించిన 200 ఎకరాల భూమిలో తొలిదశలో వంద ఎకరాల భూమి మాత్రమే బదలాయిస్తారు. భూములు కేటాయించిన సంస్థలకు స్థలాలను పరిశీలించాల్సిందిగా వౌలిక వసతుల మంత్రిత్వ శాఖ సిఆర్‌డిఏని కోరింది. రాజధానికి రానున్న అన్ని రకాల సంస్థలకు ధర, తగిన ప్రదేశాల్లో కేటాయింపు విషయంలో సిఆర్‌డిఏ అన్నిరకాల సంస్థల పట్ల ఒకేవిధమైన ప్రణాళికతో ముందడుగు వేస్తుంది. ఏపిసిఆర్‌డిఏ చట్టానికి అనుగుణంగా సిఆర్‌డిఏ విధివిధానాలను ఖరారు చేయనుంది.