ఆంధ్రప్రదేశ్‌

చలి గాలులకు ఎనిమిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అరుకులోయ, పాతపట్నం, మెళియాపుట్టి, బుచ్చెయ్యపేట, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను ప్రభావంతో వీచిన తీవ్ర చలి గాలులకు విశాఖ జిల్లా పాడేరు మండలంలో ఇద్దరు, అరుకులోయ మండలంలో ఇద్దరు, బుచ్చెయ్యపేట మండలంలో ఒకరు, రావికమతం మండలంలో ఒకరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఒకరు, పాతపట్నం మండలంలో ఒకరు చనిపోగా పాతపట్నం మండలంలోనే ఉపాధ్యాయుడు ఒకరు విద్యుదాఘాతంతో దుర్మరణం చెందారు. పాడేరు మండలంలోని గెడ్డంపుట్టు గ్రామానికి చెందిన పాంగి వెంకటరమణ (30), ఇరడాపల్లి గ్రామానికి చెందిన బడ్నాయిని అండమాన్ (63) మంగళవారం మృతి చెందారు. తుపాను కారణంగా గత రెండు రోజులుగా వీస్తున్న చలిగాలులకు వీరు తట్టుకోలేక మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అదే విధంగా అరుకులోయ మండలంలో చలికి తాళలేక రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పెథాయ్ తుపాను ప్రభావంతో వీచిన బలమైన చలి గాలులను తట్టుకోలేక మాడగడ గ్రామానికి చెందిన గాజుల మంగిలి (50), శెట్టి అప్పన్న (55) సోమ, మంగళవారాలలో మృతి చెందారు. బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన వృ ద్ధుడు మరిశా గజ్జంనాయుడు (65) మృతి చెందాడు. విశా ఖ జిల్లా రావికమతం మండలం గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన పి.పార్వతమ్మ (63) మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కోసమాల గ్రామానికి చెందిన చిన్నవాడు (65), పాతపట్నం మండలం తోలాపి గ్రామానికి చెందిన రావాడ నారాయణమ్మ (72) చలిగాలులతో మృతి చెందింది. అదేవిధంగా పాతపట్నం మండలం అంపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పాజేటి ధర్మారావు (56) విద్యుదాఘాతంతో చనిపోయారు.