ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టుల పేరుతో లేఖల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబరు 21: గుంటూరు జిల్లా పల్నాడులో మావోయిస్టుల పేరుతో వెలుస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మావోయిస్టుల పేరుతో లేఖలు రావడంపై అటు ప్రజలు, ఇటు ప్రజాప్రతిధులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం మావోయిస్టుల పేరుతో లేఖలు రావడాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎవరో కావాలనే ఇటువంటివి సృష్టిస్తున్నారని, వారిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతుండటం గమనార్హం. ప్రధానంగా గత నెల 15వ తేదీన గుంటూరు జిల్లా దాచేపల్లిలో మావోయిస్టుల పేరుతో తొలిసారిగా లేఖ వెలిసింది. శుక్రవారం అదే మండలంలోని బట్రువారిపాలెం గ్రామంలోమరోసారి మావోయిస్టులు లేఖను విడుదల చేయడం కలకలం రేపింది.మావోయిస్టుల పేరుతో విడుదల చేసిన మూడు లేఖల్లోనూ పల్నాడులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రస్తావించడం విశేషం. దాచేపల్లిలో విడుదల చేసిన మొదటి లేఖలో అధిక వడ్డీల పేరుతో ప్రజలను పీడించేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం మనె్నంవారికుంటలో రేషన్‌మాఫియాపై, బట్రువారిపాలెంలో శుక్రవారం విడుదల చేసిన లేఖలో అక్రమంగా నడుపుతున్న బెల్టుషాపును వెంటనే తొలిగించాలని, కబ్జాచేసిన భూములను వెంటనే వదిలివెళ్ళాలని, ప్రభుత్వం అందజేస్తున్న సేవలకు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు వాటిని తిరిగి బాధితులకు చెల్లించాలని మావోయిస్టుపార్టీ పల్నాడు రీజనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. అయితే లేఖల సారాంశం మాత్రం కేవలం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించే కావటం గమనార్హం. వాటిని ప్రభుత్వం, అధికారులు పరిష్కరించే అవకాశం ఉన్నవే కావడం విశేషం. అయితే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారా లేదా అన్న అంశం పక్కన పెడితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం తెరపైకి తీసుకువచ్చారు. పల్నాడు ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు ఎక్కువుగా ఉండేవారు. అయితే ఇప్పుడు వారి ఉనికి లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. నిఘా వర్గాలు సైతం వీటిని ధ్రువీకరిస్తున్నాయి. అయితే పల్నాడులో మావోయిస్టుల సానుభూతి పరులు ఎక్కువుగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి జనజీవనంలోకి వచ్చిన వారిపై సైతం పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇదిలా ఉంటే పోలీసులు సైతం మావోయిస్టుల లేఖలపై ఎటూ తేల్చలేకపోతున్నారు. ఎమ్మెల్యే కిడారి హత్య తరువాత మావోయిస్టుల ఉనికి ఉండవచ్చని కొంతమంది పోలీసులు అంగీకరిస్తుండగా నిఘా అధికారులు మాత్రం దీన్ని తేలికగా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా మావోయిస్టుల లేఖలతో పల్నాడు ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది.