ఆంధ్రప్రదేశ్‌

నలుగురు కాణిపాకం ఉద్యోగులు సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాణిపాకం, జూలై 18 : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోనిత్య అన్నదాన సత్రం నుంచి కందిపప్పును తస్కరిస్తున్న నలుగురు ఆలయ ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ఆలయ ఇ ఓ పూర్ణచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో ఒకరు శాశ్వత ఉద్యోగిని సస్పెండ్ చేసి, మరో ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. 10 రోజుల క్రితం ఆలయ నిత్య అన్నదాన సత్రం నుంచి పథకం ప్రకారం కందిపప్పును తీసుకెళ్లుతున్న వైనాన్ని ఆలయ మహిళ హోంగార్డు పసిగట్టి ఇ ఓకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆలయ ఇ ఓ గత కొంత కాలంగా అన్నదానం సత్రం నుంచి కందిపప్పు తదితర వస్తువులను కొందరు ఉద్యోగులు పథకం ప్రకారం దొంగలిస్తున్నట్లు నిర్దారించారు. ఈ ఘటనలో ఆలయ రెగ్యులర్ ఉద్యోగి అయిన మునిరత్నంను సస్పెండ్ చేసినట్లు, కాంట్రాక్టు కార్మికులైన రమేష్, అరుణ్, బుజ్జమ్మలను విధుల నుంచి తొలగించారు. ఇకపై నిత్య అన్నదాన సత్రంలో పటిష్టమైన నిఘా ఉంచుతున్నట్లు ఆలయ ఇ ఓ తెలిపారు.