ఆంధ్రప్రదేశ్‌

కాలుదువ్వుతున్న పందెం కోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 25: గోదావరి జిల్లాలు కోడి పందేలకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయం పేరిట ఏటా మూడు రోజులు ఈ రెండు జిల్లాల్లో జూదాల జాతర కొనసాగడం ఆనవాయతీ అనేది అందరికీ తెలిసిందే. సంక్రాంతి సీజనుకు మరో రెండు వారాలు మాత్రమే ఉండటంతో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. పందేల సీజను సమీపించడంతో ఎక్కడ చూసినా పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి. గోదావరి జిల్లాల సంకాంత్రి కోడి పందేలకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, విదేశాల నుండి సైతం అతిథులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని మెట్రో నగరాల నుంచి మధురపూడి విమానాశ్రయం కేంద్రంగా ఈ సారి సంక్రాంతి కోడి పందేల పర్యాటకం పెరుగుతుందని సమాచారం. మధురపూడిలో విమానం దిగి పందేలు తిలకించి, తిరిగివెళ్లడానికి ఉన్న రెండు మూడు రోజుల సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు వివిధ రకాల పందెం కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించే పందెం బరుల్లో, చిన్న చిన్న గ్రామాల శివార్లలో పందేలు కాసేందుకు స్థానిక సంతల్లో కోడి పుంజులను కొనుగోలు చేసుకుని సంక్రాంతి, బోగి, కనుమ మూడు రోజుల్లోనూ పందేలు వేసుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. పందెం కోళ్లకు అవసరమైన శిక్షణ, మేత విషయంలో జాగ్రత్తలు తీసుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతర్జాలయంలో వివిధ దేశాల్లోని కోడి పందేల బరుల నిర్వహణ ఏవిధంగా వుందో అవగాహన చేసుకుని అవసరం మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇతర ప్రాంతాల్లోని వారిని ఆకర్షించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. పందెం కోళ్ళకు శిక్షణ ఇచ్చే శిబిరాలు భారీ స్థాయిలో ఏర్పాటయ్యాయి. గుడ్డు దశ నుంచి పందెం కోడి పుంజును సిద్ధం చేసేంత వరకు శాస్ర్తియ విధానంలో శిక్షణ ఇచ్చే నిపుణులు పందేలకు బిజీ అయ్యారు. ఈ తరహా శిబిరాల్లో సిద్ధమైన పుంజులు ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయి. భారీ పందేలకు అనుగుణంగా సిద్ధంచేసిన జాతి కోడి పుంజులు రూ.లక్ష వరకు పలుకుతున్నాయి. మధ్యతరహా పందేలకు వినియోగించే పుంజు రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు పలుకుతున్నాయి. ఇది కాకుండా అప్పటికపుడు శిక్షణ ఇచ్చే కోడి పుంజులు సంతల్లో రెండు మూడు వేల నుంచి రూ.5000 వరకు ధర పలుకుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో గోదావరి జిల్లాల్లో కేవలం కోడి పందేల్లో సుమారు రెండు వందల కోట్ల వరకు చేతులు మారతాయని అంచనా. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కోరుకొండ, గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, బిక్కవోలు, ప్రత్తిపాడు, పెద్దాపురం, కిర్లంపూడి తదితర ప్రాంతాలతో పాటు కోనసీమలోని పలు మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా కోడిపందేలు జరుగుతాయి. అయితే ఇంత జరుగుతున్నా రాజకీయ ఒత్తిళ్ల మధ్య పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం షరామామూలుగా మారింది.