ఆంధ్రప్రదేశ్‌

నిధులిచ్చినందుకే ప్రధాని పర్యటనను అడ్డుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 25: రాష్ట్భ్రావృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధిని సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను టీడీపీ నాయకులు అడ్డుకోవాలని చూడటం హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం గుంటూరు సమీపంలోని బుడంపాడులో జనవరి 6వ తేదీన జరిగే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మోదీ ప్రజాచైతన్య సభను విచ్చేస్తున్నారని, ఆయనకు రాష్ట్ర ప్రజల తరపున ఆహ్వానిస్తున్నామన్నారు. విభజన చట్టంలో హామీల అమలుకు పదేళ్ల గడువు ఉన్నా, ఐదు సంవత్సరాల్లోనే విజయవాడ ఫ్లై ఓవర్, ఇతర బ్రిడ్జిల నిర్మాణానికి ఇతోధికంగా కేంద్రం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే గుంటూరు నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఇచ్చారని, రాజధాని, పోలవరం నిర్మాణానికి నూరుశాతం అడ్డంకులు తొలగించి 7 వేల కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి అందించిందన్నారు. అలాగే మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా పూర్తవుతోందని వెల్లడించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కృషిచేసి అక్కడి నుండి ఇతర దేశాలకు కూడా విమాన సర్వీసులను నడిపేందుకు కృషిచేస్తున్న కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆ పార్టీ మంత్రులు, నేతలు దుష్ప్రచారం చేయడం వారి నైజాన్ని తెలియజేస్తోందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ పర్యటనను గుంటూరులో విజయవంతం చేసి తీరుతామని కన్నా స్పష్టంచేశారు. ఆయన వెంట రాష్ట్ర కో ఇన్‌ఛార్జి సునీల్ దియోదార్, పార్టీ నాయకులు లక్ష్మీపతి, జమ్ముల శ్యామ్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మోదీ సభ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ తదితరులు