ఆంధ్రప్రదేశ్‌

నిపుణులైన ఇంజనీర్లకు తయారీ రంగంలో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 25: సాంకేతికత వినియోగంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు తయారీ రంగంలోనూ నిపుణులైన ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే జర్మనీకి చెందిన రోబోల తయారీలో అపార అనుభవం ఉన్న యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా రోబోటిక్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మెకట్రానిక్స్, రోబోటిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఒప్పందంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏడాదికి సుమారు 3వేల మందికి శిక్షఇ ఇవ్వనున్నారు. మొదటి విడతలో 11 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ఫ్యాకల్టీలను జర్మనీకి తీసుకెళ్లి శిక్షణ ఇచ్చారు. జనవరి రెండో వారంలో ఈ అధ్యాపకులతో 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో మెకట్రానిక్స్, రోబోటెక్స్ విభాగంలో అడ్వాన్స్‌డ్ ఆప్లైడ్ రోబోటిక్ కంట్రోల్ 1.0, అడ్వాన్స్‌డ్ ఆప్లైడ్ రోబోటిక్ కంట్రోల్ 2.0. అడ్వాన్స్‌డ్ ఆప్లైడ్ రోబోటిక్ కంట్రోల్ 3.0 కోర్సుల్లో 3200 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇక రెండో విడతలో మరో 15 కాలేజీల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, యూరోపియన్ సెంటర్ ఆఫ్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి దరఖాస్తులు జనవరి 2వ తేదీలోపు చేసుకోవచ్చని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శిక్షణ వ్యయం సుమారు రూ. 32వేల ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారందరికీ ఆకాన్ యూనివర్శిటీ నుంచి ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు.