ఆంధ్రప్రదేశ్‌

స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా భారతదేశం 45కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తోందని నేషనల్ మారిటైం ఫౌండేషన్ చైర్మన్, నౌకాదళ మాజీ ప్రధానాధికారి ఆర్కే ధవాన్ తెలిపారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్, నేషనల్ మారిటైం ఫౌండేషన్ సంయుక్తంగా ‘సముద్ర రంగం ఆర్థిక అవకాశాలు అంశంపై విశాఖలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నౌకానిర్మాణంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేదని, కాలక్రమంలో ఆధిపత్యాన్ని కోల్పోయి అట్టడుగుకు చేరుకుందన్నారు. భారత నౌకా నిర్మాణ కేంద్రాలను, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)ల సహకారంతో విస్తరించుకుంటున్నట్టు వెల్లడించారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఉక్కును వినియోగించుకుని యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిర్మించుకుంటున్నామన్నారు. ముంబయి తరహాలో ఉగ్రదాడులను అరికట్టేందుకు దేశ రాజధానిలో నెలకొల్పిన నేషనల్ కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌తో తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 46 రాడార్‌ల నుచి అనుక్షణం సమాచారాన్ని విశే్లషించుకుంటున్నామన్నారు. దేశ భద్రత దృష్ట్యా అండమాన్ దీవులతో పాటు లక్షద్వీప్‌లో 10 చొప్పున కృత్రిమ దీవుల నిర్మాణం చురుకుగా సాగుతోందన్నారు. సముద్రాలను ఆర్థిక వనరులుగా ఉపయోగించుకోలాంటే ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచడం, సొంతంగా వాణిజ్య నౌకల నిర్మాణం, ఖనిజ వనరుల అనే్వషణ ముఖ్యమన్నారు. అలాగే నౌకానిర్మాణ రంగానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో జలరవాణా రంగాన్ని పటిష్టం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి గీతం ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు అధ్యక్షత వహించగా, గీతం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ బీ నళిని, నేషనల్ మారిటైం ఫౌండేషన్ విశాఖ చైర్మన్ జీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మారిటైం ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే ధవాన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న గీతం డీమ్డ్ యూనివర్శిటీ
చాన్సలర్ ప్రొఫెసర్ రామకృష్ణారావు