ఆంధ్రప్రదేశ్‌

ఇక నుంచి అన్ని జిల్లాల్లో పోలీసు స్పోర్ట్స్ మీట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 27: ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి ఏడాది పోలీసు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ స్పష్టం చేశారు. డిసెంబర్‌లోగా క్రీడా వారోత్సవాలు నిర్వహించకుంటే, కనీసం జనవరిలోనైనా పూర్తి చేయాలని సూచించారు. నిరంతరం వృత్తిపరమైన ఒత్తిడితో కూడుకున్న పోలీసుల దైనందిన జీవితంలో ఆటలు ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో ఈనెల 24వ తేదీన పోలీసు స్పోర్ట్స్-2018 క్రీడోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో గురువారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ పోలీసు క్రీడాకారుల పరేడ్‌ను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన పురుషులు, మహిళల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ పోటీలను తిలకించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కమిషనరేట్‌లో 14సంవత్సరాల తర్వాత క్రీడోత్సవాలు నిర్వహించుకోవడం శుభ పరిణామం అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కొనసాగించాలని, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని పోలీసు జిల్లాల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లా స్పోర్ట్స్ మీట్‌లో అర్హత సాధించినవారికి రాష్ట్ర స్ధాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో అవకాశం కల్పిస్తామన్నారు. పోలీసులకు ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యమన్నారు. శారీరక దృఢత్వం కలిగి ఉంటే వారితోపాటు కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అప్పుడే విధుల్లో సైతం ఫిట్‌నెస్‌గా పని చేయగలుగుతారని అన్నారు. కార్యక్రమానికి విజయవాడ పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అధ్యక్షత వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీజీపీ, సీపీ బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో డీసీపీలు బి రాజకుమారి, డాక్టర్ భూపాల్, వెంకట అప్పలనాయుడు, రవిశంకర్‌రెడ్డి, ఉదయరాణి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.