ఆంధ్రప్రదేశ్‌

8మంది సూపర్ న్యూమరరీ డీఎస్పీలకు స్థానచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 27: రాష్ట్రంలో ఎనిమిది మంది సూపర్ న్యూమరరీ డీఎస్పీలకు స్థానచలనం కలిగింది. ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి బదిలీ చేస్తూ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు ట్రాఫిక్ డిఎస్పీ సిఎం గంగయ్యను తిరుపతి స్పెషల్ బ్రాంచి డిఎస్పీగా, ఇక్కడ పని చేస్తున్న టి రవి మోహనారిని అదనంతపురం ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీగా బదిలీ చేశారు. అదేవిధంగా చిత్తూరు సిసిఎస్-1 డిఎస్పీ ఐ రామకృష్ణను కడప ట్రాఫిక్ డిఎస్పీగా, కర్నూలు సిసిఎస్ డిఎస్పీ జి హుస్సేన్ పీరాను కడప జిల్లా ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీగా బదిలీ చేశారు. అదేవిధంగా తిరుపతి ఎస్సీ, ఎస్టీ సెల్-1 డిఎస్పీ ఎన్ సుధాకర్‌రెడ్డిని కర్నూలు ట్రాఫిక్ డిఎస్పీగా, సిఐడి డిఎస్పీ సయ్యద్ మున్వర్ హుస్సేన్‌ను అనంతపురం మహిళా పోలీస్టేషన్ డిఎస్పీగా, ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న జి నాగ సుబ్బన్నను తిరుపతి ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీగా, చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ యు సూర్యనారాయణను కర్నూలు సిసిఎస్ డిఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఏలూరు రేంజ్‌లోని కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో 18మంది సిఐలకు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల రేంజ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన బదిలీల్లో విఆర్‌లో కొనసాగుతున్న వారు ఉన్నారు.