ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు నీటి భద్రతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రజలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటి వరకూ సాగునీటి ప్రాజెక్టులపై 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి స్థిరీకరించినట్లు తెలిపారు. సహజ వనరులు- జలవనరులపై ఉండవల్లిలోని ప్రజావేదికలో 5వ శే్వతపత్రంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఇప్పటి వరకూ 15,363 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. కేంద్రం నుంచి ఇందుకు సంబంధించి 3500 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. 2019 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గత నాలుగు పంట సీజన్లలో 263 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించాం. కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీరు ఇవ్వడం ద్వారా తుపానుల నుంచి పంటలను కాపాడగలిగాం. 1667 కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చు చేయగా, 44 వేల కోట్ల రూపాయల మేర పంట దిగుబడులు వచ్చాయి. ప్రాధాన్య ప్రాజెక్టులను 62 గుర్తించి చేపట్టాం, ఇప్పటికే 17 ప్రాజెక్టులు పూర్తి చేయగా, మరో ఆరు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఇప్పటికే పూర్తి చేయగా, గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా 320 టీఎంసీల నీటిని ప్రకాశం, గుంటూరు, నెల్లూలు జిల్లాలకు, సోమశిల రిజర్వాయరుకు నీటి తరలింపును రెండు దశల్లో చేపట్టనున్నాం. వంశధార, నాగావళి, నాగావళి-స్వర్ణముఖి, వేగవతి, చంపావతి నదుల అనుసంధానం ప్రక్రియ జరుగుతోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ జరుగుతోంది. వంశధార-బాహుదా నదుల అనుసంధానంపై డీపీఆర్ తయారైంది. ఇటువంటి చర్యల ద్వారా మహా సంగమం సాధ్యం కానుంది.నీరు-చెట్టు, నీరు- ప్రగతి కింద 3348 కేస్కేడ్‌లను అభివృద్ధి చేశాం. 8.356 లక్షల పంట కుంటలను తవ్వాం. వివిధ చెరువుల్లో, కుంటల్లో 84 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేయడం ద్వారా అదనంగా 7.11 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగాం. భూగర్భ జలాలలను ఉపరితలం నుంచి 3 - 8 మీటర్ల లోతులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నీ టి సంరక్షణ చర్యల కారణంగా లోతుగా నీరు ఉం డే ప్రాంతాల సంఖ్యను 2874 నుంచి 2297కు త గ్గించగలిగాం. దీంతో రూ.440 కోట్లు ఆదా అయిం ది. భూగర్భ జలాల 708 టీఎంసీలకు చేరుకుంది. పచ్చదనంను 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతానికి తీసుకువచ్చేందుకు చర్యలు రూపొందించాం.
విభజనకు ముందు..
రాష్ట్ర విభజనకు ముందు రూ.1.90 లక్షల కోట్ల తో 86 ప్రాజెక్టులు ప్రతిపాదించారు. నిధులు ఖ ర్చు చేసినా సాగు నీరు అందుబాటులోకి రాలేదు. కాలువలు తవ్వి, ప్రధాన హెడ్ వాటర్ పనులను చేపట్టకపోవడం వల్ల నిధులు వృథా అయ్యాయి. నీటి నిర్వహణ, నీటి పర్యవేక్షణ విధానాల అమలు వల్ల నీటి లభ్యతను రియల్ టైమ్‌లో తెలుసుకునే వీలు కలిగింది. భూగర్భ జలాల లభ్యతను తెలుసుకునేందుకు 1254 చోట్ల పీజో మీటర్లను ఏర్పా టు చేశాం. విభజనకు ముందు గోదావరి, కృష్ణా, పెన్నా, సాగర్ కాలువ వ్యవస్థలను ఆధునీకరించ డంతో కరవు నివారణకు చర్య లు తీసుకోలేదు. చి న్న నీటి పారుదల వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర విభజన వల్ల దాని ప్రభావం సాగునీటి అవసరాలపై పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంతరాష్ట్ర సమస్యగా మారింది. 2014 తరువాత నీటికి సంబంధించి మూడంచెల విధా నం అమలు చేసింది. నీటి పొదుపు, నదుల అనుసంధానం, పెండిం గ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సా రించింది. నీటి పొదుపు చర్యలు ఉద్యమ రూపం గా చేపట్టింది. నీరు చెట్టు, జలసిరికి హారతి వంటి కార్యక్రమాల ద్వారా నీటి పొదుపు ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కలిగించింది. ఈ ప్రభుత్వం 13 కొత్త ప్రా జెక్టులు చేపట్టింది. వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా కొ త్త బ్యారేజీ నిర్మాణం, ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, గుంటూ రు కాలువ విస్తరణ వంటివి ప్రతిపాదించింది. గోదావరి, పెన్నా, గోదావరి- వంశధా ర, ఉత్తరాంధ్ర సులజ స్ర వంతి, వంశధార, నాగావళి, నాగావళి- స్వర్ణముఖి, వేగవతి, చంపావతి నదుల అనుసంధానించింది.