ఆంధ్రప్రదేశ్‌

ఇదేమి న్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 28: ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఈ దేశ పౌరులం కాదా అని మండిపడ్డారు. మేం పన్నులు చెల్లించటంలేదా.. ఆదాయం మాది..పెత్తనం మీదా.. ఇదేమి న్యాయమని ధ్వజమెత్తారు. ఒక రాష్ట్రంపై కేంద్రం ప్రవర్తించే తీరు ఇదేనా అని నిలదీశారు. రాష్ట్రం రుణమాఫీ చేస్తే రెవెన్యూలోటు భర్తీతో లింకుపెట్టి వద్దన్న కేంద్రం ఇప్పుడు ఎన్నికల కోసం రుణమాఫీని తెరపైకి తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. విభజన చట్టంలోని అంశాలేవీ అమలు చేయకపోగా.. రైల్వేజోన్..కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటూ రాష్ట్రానికి ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని ఆక్షేపించారు. శుక్రవారం ఉండవల్లిలో మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖలో ఎయిర్‌షో రిహార్సల్స్ జరిగిన తరువాత ఆకస్మికంగా రద్దు చేయటంలోని ఆంతర్యమేమిటో తేల్చాలన్నారు. కడప ఉక్కు కర్మాగారం వల్ల కేంద్రానికి ఆదాయం వస్తుందని చెప్పినా వినకుండా కుంటిసాకులు చెప్పారని, రాష్టమ్రే ఇబ్బందులు భరించి ఏర్పాటు చేస్తుంటే అవరోధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఏర్పాటుకు గడువు తక్కువ ఇచ్చి వివాదాలు రేకెత్తిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వంది మాగధుల అండచూసుకుని మోదీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా కేంద్రానికి పన్నులు చెల్లించకుండా ఉండే విషయమై పరిశీలన జరుపుతున్నాం..రాష్ట్రానికి ఏం న్యాయం చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నిధులు మంజూరు చేయని నేపథ్యంలో పన్నులెందుకు కట్టాలని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్ అంటూ ఓ వర్గం వారిని వేరుచేయటంతో పాటు క్రిమినల్ కేసులు బనాయించటం సమంజసం కాదన్నారు. దీన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అంతా ఈ దేశ పౌరులైనప్పుడు వివక్ష దేనికని ప్రశ్నించారు. అందరికీ ఒకే పీనల్‌కోడ్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు బీజేపీ తూట్లు పొడుస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాల్సి ఉందని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయటం దేశ సమగ్రతకే భంగకరమని హెచ్చరించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ మోదీకి ఊడిగం చేస్తూ అడ్డంకులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం మోదీకి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సొంత జిల్లాలోనే ఉక్కు ఫ్యాక్టరీకి స్పందించని జగన్ పార్లమెంటు, శాసనసభ స్థానాల్లో మెజారిటీ స్థానాలిచ్చిన ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైకోర్టుకు వసతి చూపిస్తాం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు స్పందించారు. రాజధానిలో కోర్టు భవనాలు సిద్ధమయ్యే వరకు తాత్కాలికంగా విజయవాడ క్యాంప్ కార్యాలయం లో వసతి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. న్యాయ మూర్తులకు ఎలాంటి లోటూ రానివ్వమని స్పష్టం చేశారు. కేం ద్రం దురుద్దేశ్యంతోనే హైకోర్టు తరలింపునకు గడువు తగ్గించిందని ఆరోపించారు. హైకోర్టు తరలింపు వల్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు లేకపోలేదనే అనుమానం వ్యక్తంచేశారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్రపన్నారని మండిపడ్డారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ అతిథిగృహం అందుబాటులో ఉందన్నారు. న్యాయమూర్తుల నివాసాలకు అవసరమైతే విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూడురోజులు సహకరిస్తే జనవరి 20 కల్లా సొంత భవనాల్లో ఏర్పాటు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. క్యాంప్ కార్యాలయంలో 8 కోర్టు హాళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని కక్షిదార్లు, న్యాయవాదులకు కూడా తగిన సదుపాయం ఉందని చెప్పారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పరంగా తాత్కాలిక వసతి కల్పిస్తామన్నారు.