ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ సెజ్‌లో మెగా పెట్రో కెమికల్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 28: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో మెగా పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరిగిన స్టేట్ ఇనె్వస్టుమెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో చర్చించారు. కమిటీ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హల్దియా పెట్రో కెమికల్స్ సంస్థ, టీసీజీ రిఫైనరీ సంస్థ కలిసి కెమికల్ మ్యాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో దశలవారీగా 62 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుందని, ప్రత్యక్షంగా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని 2500 ఎకరాలను ఆ సంస్థే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రైవేట్ భూముల ధరలు, పెట్టుబడులు, జీఎస్టీ, బాహ్య వౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్, క్యాపిటల్ ఇనె్వస్టుమెంట్, విద్యుత్ రాయితీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మన్మోహన్‌సింగ్, డి.సాంబశివరావు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు.