ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలకు సంక్రాంతి సెలవులపై సందిగ్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలోని పాఠశాలకు సంక్రాంతి సెలవులపై సందిగ్థత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుంచి 11 వరకూ నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే అంశంపై ఉపాధ్యాయులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ, సెలవుల్లో పని చేసేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో ఆయోమయం నెలకొంది. జనవరి 2 నుంచి 11 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కొంతమంది ఉపాధ్యాయులను నోడల్ అధికారులుగా, కొంతమందిని గ్రామస్థాయి అధికార బృందాల్లో నియమిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 8 నుంచి పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించాల్సి ఉంది. దీనిపై కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యంతరాన్ని పాఠశాల విద్యా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాయి. సెలవు రోజుల్లో పని చేయాలనడం సరికాదని తమ అభ్యంతరాలను తెలుపగా, పాఠశాల విద్యా కమిషనర్ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులను జనవరి 12 నుంచి 22 వరకూ మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. పాఠశాలలకు సెలవులు 8 నుంచి ప్రారంభం అవుతాయని, నోడల్ అధికారులుగా నియమితులైన వారిలో కొంతమంది ఉపాధ్యాయులకు అప్పటికే తమ విధులు పూర్తి అయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎక్కువ మందికి ఇబ్బంది ఉండదని ఒక ఉపాధ్యాయ సంఘం చెబుతోంది. అయితే గతంలో జన్మభూమిలో పనిచేసిన ఉపాధ్యాయులకు వేరే రోజుల్లో సెలవులు మంజూరు చేశారని మరో ఉపాధ్యాయ సంఘం నేత అంటున్నారు. దీంతో జన్మభూమిలో ఉపాధ్యాయులు పాల్గొనే అంశం, సంక్రాంతి సెలవుల అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.