ఆంధ్రప్రదేశ్‌

జగన్... వాయిస్ ఆఫ్ బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 28: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రహసనంగా ముగిసిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాదయాత్రలో పక్కా హామీలేవీ లేవని, ఒక్క సమస్యపై సంబంధిత జిల్లా కలెక్టర్లకు లేఖ రాసిన దాఖలాలులేవని ఎద్దేవా చేశారు. అదొక నిరర్థక పాదయాత్రగా శుక్రవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్రకు జగన్ పాదయాత్రకు పొంతన లేదన్నారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ధ్వజమెత్తారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు జగన్‌కు ఇష్టం లేదన్నారు. కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. దానికి కూడా అడ్డంకులు కల్పించటం కడపతో పాటు రాయలసీమకే ద్రోహంచేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. సీమ ద్రోహిగా జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. జగన్ పెడుతున్న అడ్డంకులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెప్తారని స్పష్టంచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. హోదా కోసం కేంద్ర మంత్రి పదవులు వదులుకుని అవిశ్వాసం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని వైసీపీ ఏం చేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా హోదాపై జగన్ నోరుమెదపక పోవటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. హోదాపై పార్లమెంటులో టీడీపీ ఆందోళన నిర్వహిస్తుంటే వైసీపీ మోదీతో లాలూచీపడి గోదా వదిలేసిందని చమత్కరించారు. సభలో పోరాడకుండా రోడ్డుపక్క విగ్రహాల మాటున చేసేది పోరాటమెలా అవుతుందని నిలదీశారు. పార్లమెంటుకు పోక, అసెంబ్లీకి రాక ప్రతిపక్షం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. హోదా ఇవ్వాల్సిన మోదీపై పోరాడకుండా చంద్రబాబును నిందించటం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. పోలవరానికి ఇవ్వాల్సిన 3500 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కింద ఇచ్చిన 350 కోట్లు వెనక్కు తీసుకుంటే ఎందుకు జగన్ ఎందుకు స్పందించరన్నారు.
జగన్ వాయిస్ ఆఫ్ బీజేపీగా మారారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి హైకోర్టు రావటం కూడా వైసీపీకి ఇష్టంలేదని అభివృద్ధి నిరోధకశక్తిగా గుర్తింపు పొందిందని మండిపడ్డారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని తన రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదన్నారు.