ఆంధ్రప్రదేశ్‌

నేడు జిల్లా కలెక్టర్ల 19వ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 28: సంక్షేమం...గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వౌలిక సదుపాయాల పురోగతి...6వ జన్మభూమి...చుక్కల భూములు.. ఈ నాలుగు అంశాలే ప్రధాన అజెండాగా జిల్లా కలెక్టర్ల 19వ సదస్సు శనివారం జరగనుంది. ఈనెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ తొలి పది ప్రధాన కార్యక్రమాలపై సమాలోచన జరగనుంది.
గ్రామాల్లో 10 స్టార్, పట్టణ ప్రాంతాలలో 9 స్టార్ రేటింగ్ ఇస్తున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. సంక్షేమ రంగానికి సంబంధించి నూరుశాతం నిత్యావసరాల పంపిణీ, రేషన్ కార్డుల అందజేత, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, చంద్రన్న పెళ్లి కానుక, ముఖ్యమంత్రి యువనేస్తం, చంద్రన్న బీమా, గృహనిర్మాణం వంటి పథకాలపై చర్చ సాగనుంది. వౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్చలో ఘన వ్యర్థాల నిర్వహణ, ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు, మురుగు కాల్వల వ్యవస్థ, ఫైబర్ గ్రిడ్, రహదారులు (అనుసంధానత, సీసీ రోడ్లు), తాగునీరు, గ్యాస్ సరఫరా, విద్యాలయాలలో మరుగుదొడ్లు సహా అన్ని వౌలిక వసతులపై చర్చించనున్నారు. ఈ రెండు అంశాలతో పాటు కొత్త ఏడాది ఆరంభం కాబోయే జన్నభూమి - మా ఉరు 6వ విడత కార్యక్రమ అజెండా, ఏర్పాట్లుపై చర్చించనున్నారు. ఈ విడత జన్మభూమి - మా ఉరు కార్యక్రమంలో భాగంగా ప్రజల ముందుంచనున్న రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రగతి ప్రణాళికా వ్యూహాలపై సమగ్రంగా చర్చించి ఖరారు చేయనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించి తగిన వ్యూహాల్ని ఖరారు చేయనున్నారు. చుక్కల భూముల సమస్యపై జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆయా కలెక్టర్లతో సమీక్షిస్తారు. సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షను మూడు సెషన్లుగా చేపట్టనున్నారు. రేషన్ కార్డుల పంపిణీ మొదలు గృహ నిర్మాణం వరకు వున్న అంశాలను ముందుగా చర్చించనున్నారు. తరువాత సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తారు. వీటికింద అన్న క్యాంటీన్లు, నూరు యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యం - పౌష్టికాహారం, మాతా శిశు మరణాలు, రక్తహీనత ఇంటింటికీ నీటి సరఫరా, పాఠశాలల్లో హాజరు శాతం, మధ్యాహ్న భోజనం వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. మూడో సెషన్‌లో పేదరికంపై గెలుపు, జన్మభూమి, ఆదరణ, కుటుంబానికి నెలకు కనీసం పదివేల ఆదాయం వంటి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను సమీక్షించనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు ఒక రోజు నిర్వహించే ఈ సదస్సులో పాల్గొననున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ చంద్రబాబునాయుడు ముఖ్యప్రసంగం చేయనున్నారు.