ఆంధ్రప్రదేశ్‌

తాబేలుతో పోటీ... పోలవరం టనె్నల్స్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 28: పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా ఎడమ వైపు కనెక్టివిటీల్లో చేపట్టిన టనె్నల్స్ నిర్మాణ పనులు తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పనుల్లో కనీస పురోగతి కనిపించడంలేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ గట్టు వైపు ప్యాకేజీ నెంబర్ 65, 66లో 919 మీటర్లు, 890 మీటర్ల పొడవైన టనె్నల్స్ నిర్మాణం చేపట్టారు. రూ.180.99 కోట్ల విలువైన ఈ రెండు ప్యాకేజీల్లో ఇప్పటి వరకు కేవలం సుమారు రూ.52.16 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయంటే పనులు జరుగుతున్న తీరు అర్థమవుతుంది.
ప్యాకేజీ నెంబర్ 65లో 919 మీటర్ల పొడవైన టనె్నల్, లెఫ్ట్ ప్లాంక్ రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టారు. ముంబైకి చెందిన మెసెర్స్ యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ ఈ పనులు చేపట్టింది. పనులను 2005లో చేపట్టి 2007లో పూర్తి చేయాల్సివుంది. ముందుగా రూ.90.99 కోట్ల అంచనా విలువైన పనులను అగ్రిమెంట్ చేసుకుంటే ఆ తర్వాత అదనంగా మరో రూ.12.92 కోట్లతో అదనపు అగ్రిమెంట్ చేశారు. మొత్తం 103.91 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 14.88 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం రూ.15.46 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. అవసరమైన భూమిని 134.50 ఎకరాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా అప్పగించారు.
డిజైన్లు కొన్ని ఆమోదం పొందాయి. మరి కొన్నింటికి ఆమోదం లభించాల్సివుంది. ఈ ప్యాకేజీలో ప్రధానంగా లాక్ కం హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టనె్నల్‌ను నిర్మించాల్సివుంది. మట్టి పని సుమారు 35 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటి వరకు సుమారు 28 లక్షల క్యూబిక్ మీటర్ల మేర జరిగింది. కాంక్రీటు పని, స్ట్రక్చర్ల పనులు కనీస స్థాయిలో కూడా మొదలు కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా కూలీలకు, మిషనరీకి కలిపి సుమారు రూ.7.63 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.89 లక్షల వడ్డీ రికవరీ చేశారు. వాస్తవానికి 2018 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాల్సిందిగా నిర్ధేశించినప్పటికీ ఇప్పటికొచ్చి కనీస పురోగతి కన్పించడం లేదు. ఈ పనుల్లో కొన్ని సాంకేతిక అవాంతరాలు చిక్కుముడుల నుంచి బయట పడాల్సివుందని తెలుస్తోంది.
ఇక ప్యాకేజీ 66గా రూపొందించిన వాటిలో 890 మీటర్ల పొడవైన టనె్నల్ నిర్మాణం, శాడిల్ డ్యామ్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్ నిర్మాణాన్ని చేపట్టారు. మెసెర్స్ శ్రీ అవంతిక, సాయి వెంకట జేవీగా మొదట్లో రూ.90 కోట్ల అంచనా విలువకు అగ్రిమెంట్ చేసుకుంటే అందులో సప్లిమెంటరీ అగ్రిమెంట్‌గా రూ.12.92 కోట్లు తొలగించి రూ.77.08 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. ఈ పనులను కూడా అన్ని పనుల మాదిరిగానే 2005లో చేపట్టారు. రెండేళ్ళ వ్యవధిలో 2007 నాటికి పూర్తి చేయాల్సి వుంది. అయితే ఇప్పటి వరకు సుమారు రూ.36.70 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అవసరమైన 95.95 ఎకరాల భూమిని పనులు చేపట్టడానికి ముందే అప్పగించారు. ఈ ప్యాకేజీలో ప్రధానంగా నేవిగేషన్ టనె్నల్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్, శాడిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఇంకా కొన్ని డిజైన్లు ఆమోదం లభించాల్సివుంది. మొత్తం 29.27 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను ఇప్పటివరకు 20.47 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అంటే 69.94 శాతం పని పూర్తయింది. కాంక్రీటు పనులు గానీ, స్ట్రక్చర్ల నిర్మాణం గానీ మొదలుకాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా రూ.6 కోట్లు ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు రూ.89 లక్షలు వడ్డీగా రికవరీ చేశారు. 2019 మే 31లోగా పనులు పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగింది. ఈ పనుల్లో కూడా మధ్యలో ఉన్న సత్యసాయి మంచినీటి పథకం పైపులైన్ మార్చాల్సి వుంది. మొత్తం మీద ఎడమ వైపు కనెక్టవిటీ పనుల్లో కనీస పురోగతి కన్పించని ఈ పనులను పరుగుతీయించి, నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తే మినహా ప్రస్తుతం ప్రకటిస్తున్న ప్రాజెక్టు ప్రారంభ గడువు లక్ష్యం ఊహాజనితమేనని చెప్పవచ్చు.