ఆంధ్రప్రదేశ్‌

కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 28: ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తక్షణమే ప్రభుత్వం కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా శుక్రవారం ఒంగోలులోని దక్షిణ బైపాస్‌రోడ్డులోని జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఆందోళనకారులు రోడ్డుకు అడ్డంగా నిలబడి రాస్తారాకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అప్పటికే అక్కడకు భారీగా చేరిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్టక్రార్యదర్శి కె రామకృష్ణ, సీపీఎం రాష్టక్రార్యదర్శి పి మధుతోపాటు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్టక్రార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్టక్రార్యదర్శి పి మధు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం 347 మండలాలను కరవుమండలాలుగా ప్రకటించినప్పటికీ ఏ ఒక్క మండలంలో కూడా ఇప్పటివరకు కరవు సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో అధికార కాంక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు రెండు శిలాఫలకాలను వేస్తున్నారే తప్ప కరవుతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించటంలో వైఫల్యం చెందుతున్నారని ధ్వజమెత్తారు. సాగు,తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరవు సహాయక చర్యలను చేపట్టమని ఉభయకమ్యూనిస్టుపార్టీలతో పాటు జనసేన పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చారు. తొలుత సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల నాయకులు కరవుసహాయక చర్యలు చేపట్టి కరవుప్రకటించిన మండలాల్లో ఒక్కొ మండలానికి పదికోట్ల రూపాయలు సహాయం వెంటనే అందచేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.