ఆంధ్రప్రదేశ్‌

సొంత జిల్లానే విస్మరించిన జగన్ రాష్ట్రానికేం ఒరగబెడతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, డిసెంబర్ 28: తన సొంత జిల్లా కడపలో సమస్యలనే పట్టించుకోని ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రానికి సీఎం అయి ఏం ఒరగబెడతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆదరణ-3 పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన గ్రౌండింగ్ మేళా, బహిరంగ సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ప్రతిపక్ష నేత జగన్ తీరును దుయ్యబట్టారు. తన సొంత జిల్లా కడపలో స్టీల్‌ప్లాంట్ సాధనకు జగన్ ఏ విధమైన ప్రయత్నమూ చేయలేదన్నారు. జైలు జీవితం ఎలా ఉంటుందో ఆయన చెప్పగలరని, ప్రజాజీవితం ఎలా ఉండాలో ఆయనకేం తెలుసని అపహాస్యం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీ చేస్తానంటే ప్రధాని అడ్డుతగిలారని ఆరోపించారు. తలకుమించిన భారమైనా రైతన్నను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన ఘనతను దక్కించుకున్నామన్నారు. రాష్ట్రం విడిపోయాక అప్పుల భారంతో ఉన్న ఏపీ అభివృద్ధికి బాసటగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అందుకు భిన్నమైన వైఖరితో అడుగడుగునా అడ్డు పడ్డారన్నారు. పేదరికంపై పోరు సాగించి అందరికీ ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు తాను రేయింబవళ్లు పనిచేస్తున్నానన్నారు. తాను పడుతున్న కష్టం కుంటుంబం కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసమన్న విషయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో తిరిగి ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముంగిటకు వస్తాయన్నారు.
గర్భం దాల్చిన శిశువు నుండి శ్మశానవాటిక వరకు అడుగడుగునా మనిషి జీవితంలో ప్రభుత్వ సంక్షేమమంటే ఎలా ఉంటుందో ఇప్పటికే చేసి చూపించామని, భవిష్యత్‌లో మరిన్ని చేయాల్సి ఉందన్నారు. పల్లెలను నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని, మట్టిరోడ్లు సిమెంట్ రోడ్లుగా రూపాంతరం చెందాయని, దీపాలు లేని ఇళ్లలో ఎల్‌ఈడీ కాంతులు విరజిమ్ముతున్నాయన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఓనర్లను చేస్తున్నామని, తరువాత వారు పారిశ్రామిక వేత్తలు కావాలని ఆకాంక్షించారు. బడుగు బలహీనవర్గాల వారిని, కులవృత్తుల వారిని ఆదుకునే లక్ష్యంతో చేపట్టిన ఆదరణ పథకం ఆధునికత ప్రభావంతో సతమతమవుతున్న వివిధ వృత్తుల వారికి ఎంతో తోడ్పాటును అందించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు అన్నివిధాలా మేలు కలిగిందన్నారు. గత కాంగ్రెస్ పాలకులకు అధికార దాహం తప్ప ప్రజా సంక్షేమం పట్టలేదన్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేతలు కూడా అదే తీరును అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. హోంమంత్రి చినరాజప్ప, కార్మిక శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖామంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, రెడ్డి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
దాదాపుగా 80కోట్ల వ్యయంతో వివిధ పథకాల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలను ఈ సభ వేదికగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మూతపడిన తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని ఇదే వేదికపై క్రషింగ్ పునఃప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.