ఆంధ్రప్రదేశ్‌

సీమ బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 28: రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న కరువు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ, సీపీఎం సంయుక్తంగా చేపట్టిన రాయలసీమ బంద్ పాక్షికంగా జరిగింది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో బంద్ సందర్భంగా పలువురు వామపక్షనేతలను పోలీసులు అరెస్టుచేసి అనంతరం విడుదల చేశారు. కొన్నిచోట్ల ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో ఉదయం నుంచే నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. అయితే పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో ఆర్టీసీ బస్టాండ్, నగరంలో ఆందోళనకు దిగిన నాయకులు, కార్యకర్తల్ని, ఐద్వా నాయకురాళ్లు 173 మందిని అరెస్టు చేశారు. జిల్లాలోని గుంతకల్లు, హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో బంద్ పాక్షికంగా జరిగింది.
కడప జిల్లాలో ...
కడప: కడప జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. కడపలో వామపక్షాలు, జనసేన నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. నగరంలో మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి బంద్‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టుచేసి అనంతరం విడిచిపెట్టారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు సిటీ: కర్నూలు జిల్లాలో వామపక్షాల బంద్ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. ఉదయం ఆర్టీసీ బస్సులు తిరగలేదు. పలుచోట్ల బస్సులను అడ్డుకున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టుచేసి అనంతరం విడిచిపెట్టారు. జిల్లాలోని ఆదోని, డోన్, నంద్యాల, బనగానపల్లె, ఎమ్మిగనూరు, మంత్రాలయం, బేతంచెర్ల, నందికొట్కూరు ప్రాంతాల్లో బంద్ పాక్షికంగా జరిగింది.