ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో పెరుగుతున్న రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 28: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగిసినపనప్పటికీ యేడాది ముగింపు నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కూడా శుక్రవారం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 24 గంటలు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అన్నదానం సిబ్బంది నిరంతరాయంగా అన్న ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నారు. కాలినడకన కేటాయించే దివ్యదర్శనం టోకెన్లు, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను నిలిపివేయడంతో తిరుమలకు వచ్చిన భక్తులు సర్వదర్శనం క్యూలైన్‌లోకి చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులు దర్శనమిస్తున్నారు. దీంతో టీటీడీ వీఐపీ దర్శనాలను రద్దుచేసి ప్రొటోకాల్‌కే పరిమితం చేసి సామాన్య భక్తులకే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే తిరుమలకు చేరుకున్న భక్తులు గదులను పొందడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
గదులు దొరకని భక్తులు టీటీడీ ఏర్పాటుచేసిన లాకర్ సదుపాయంతో తమ లగేజీలను లాకర్లలో భద్రపరచుకొని శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. మరికొందరు షెడ్ల కింద తలదాచుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా భక్తులతో నిండి నారాయణగిరి ఉద్యానవనాలలో ఏర్పాటుచేసిన క్యూలైన్‌లో బారులు తీరారు. రద్దీ కారణంగా క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం విభాగం అధికారులు ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు వంటివి శ్రీవారి సేవకుల సహాయంతో నిరంతరాయంగా అందజేస్తున్నారు. ఈ రద్దీ కారణంగా తిరుమలలో సందర్శనీయ ప్రాంతాలైన పాపవినాశం, శ్రీవారి పాదాలు తదితర ప్రాంతాలు భక్తులతో సందడిగా నెలకొన్నాయి. ఈ రద్దీ జనవరి 2వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెపుతున్నారు.