ఆంధ్రప్రదేశ్‌

ప్రయాణాల్లో మహిళల రక్షణకు ‘అభయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 29: ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించే అభయ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఆవిష్కరించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద పోస్టర్‌ను విడుదల చేసిన చంద్రబాబు మాట్లాడుతూ అంతర్జాల పరిజ్ఞానాన్ని వినియోగించి రవాణాశాఖ రూపొందించిన అత్యాధునిక అభయ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణ సమయాల్లో బాలికలు, మహిళల భద్రతకు చర్యలు తీసుకునే వీలుంటుందన్నారు. ప్రజారవాణా వాహనాలలో ప్రయాణించే బాలికలను, మహిళలను అభయ ప్రాజెక్టు ద్వారా ఎలా రక్షించగలమో తెలిపే పరికరం పని తీరును రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.49 లక్షల ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయన్నారు. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష వాహనాలలో అభయ ప్రాజెక్ట్ పరికరాన్ని ముందుగా అమరుస్తామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖ నగరాలలో ఈ పరికరం పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో బాలికలు, మహిళలు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆటో బయట ఏర్పాటు చేసిన అభయ పరికరం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలని, తద్వారా వాహనాల, డ్రైవర్ వివరాలను పరిశీలించుకోవచ్చన్నారు. ఆటో ఎక్కిన తరువాత తాము చేరవలసిన గమ్యస్థానాన్ని తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా టైప్ చేయాలన్నారు. వెంటనే గమ్యస్థానానికి చేరుకోవడానికి మూడు మార్గాలు మొబైల్‌లో కనిపిస్తాయన్నారు. డ్రైవర్ ఈ మూడు రూట్లలో కాకుండా వేరే మార్గంలో వెళుతున్నా, రహదారి లేని ప్రాంతాలకు వాహనాన్ని మళ్లించినా ప్రమాద సంకేతాలు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అందుతాయని కమిషనర్ వివరించారు. ఈ ప్రమాద సంకేతాలు అందగానే పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న అధునాతన పరికరాల సాయంతో వాహనాన్ని రిమోట్‌తో నిలిపివేసి దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ పోలీస్‌కు సమాచారాన్ని చేర వేస్తారన్నారు. పోలీసులు వచ్చే లోపు బాధితులు అత్యవసర బటన్ నొక్కటం ద్వారా ముందుగానే రికార్డయిన మెసేజ్ ద్వారా చుట్టు పక్కల వారి సహాయాన్ని పొందే సౌలభ్యం ఉంటుందన్నారు. తద్వారా అపాయం నుండి రక్షించే అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు.

చిత్రం.. అభయ ప్రాజెక్ట్ పోస్టర్‌ను విడుదల చేసిన ముఖ్యమంత్రి